ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతి బోత్స సత్యనారాయణ త్వరలో ప్రభుత్వం చేపట్టిన స్థల సేకరణ గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంకు అనువైన భూములు, ఇతరుల కబ్జాలో ఉన్న భూములు, నిరుపయోగమైన స్థలాలను గుర్తించేందుకు 38 టీంలను ఫాం చేసినట్టుగా వెల్లడించారు. ఈ టీంలు దాదాపు పది మండలాల్లో సర్వే నిర్వహించారు.  సుమార్ 6116.5 ఎకరాల ప్రభుత్వ భూముల్ని, ఎసైన్డ్ భూముల్ని గుర్తించినట్టుగా వెల్లడించారు.


వారినుంచి భూమిని ప్రభుత్వం సెకరించిన తరువాత ఎసైన్డ్‌ భూములు ఇచ్చిన వారికి ఎకరాకు 900 గజాలు, ఆక్రమించిన వారు పదేళ్ల పైబడి ఆ స్థలంలో ఉంటే 450 గజాలు, ఐదేళ్లుగా ఆక్రమణలో ఉన్నవారికి 250 గజాలు భూములు ఇచ్చేట్టుగా వారిని ఒప్పించినట్టుగా బోత్సా వెల్లడించారు. అయితే ప్రక్రియ అంతా గత ప్రభుత్వంలా కాకుండా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎవరైతే భూమిని ఇచ్చారో తిరిగి డెవలప్‌ చేసిన భూమిన ఆ వ్యక్తి పేరు మీదే ఇస్తామని వెల్లడించారు.


అయితే ప్రక్రియలో ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, ఎవరి మీద ఒత్తిడి చేయటంలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాను తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన కోరారు. అయితే తెలుగుదేశం పార్టీ చేసిన లాండ్‌ పూలింగ్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం పేదల కోసం చేసింది కాదు. అందుకే వాళ్లు మిగిలిన ప్రభుత్వాలు అన్ని అదే పని చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందరికీ సొంత ఇల్లు ఉండాలన్న మా ప్రభుత్వ పాలసీలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.


ఈ ప్రయత్నంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరెలాంటి మాటలు మాట్లాడినా మేం పట్టించుకోం. ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అధికారులకు కూడా తప్పు చేస్తే చర్యలు సీరియస్‌గా ఉంటాయని తెలియజేశాం. పేదల కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్న జగన్‌మోహన్‌ రెడ్డి గారి మీద ప్రతిపక్షం బురుదజల్లాలని చూస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: