కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్టాన్ని దేశంలో చాలా పార్టీలు మరియు కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల దేశం ముక్కలు అయిపోయే చాన్స్ ఉందని ప్రజల మధ్య విద్వేషాలు రేగే అవకాశం ఉందని ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తీవ్రంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై విభేదిస్తున్నారు. అలా విభేదిస్తున్న పార్టీలలో ఒక పార్టీ మజ్లిస్. పౌరసత్వ చట్టాన్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు అమలు కాకుండా చూస్తామని మజ్లిస్ అధినేత ఓవైసీ అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.

 

ఈ చట్టంతో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కుట్ర వెనకాల దాగి ఉందని సీఏఏ.. ఎన్ ఆర్ సీ.. ఎన్ పీఆర్ లకు వ్యతిరేకంగా ఆయన కర్నూలులో గళం విప్పారు. ఎన్ ఆర్ సీ.. ఎన్ పీఆర్ లకు సంబంధం లేదని కేంద్రం చెబుతోందని.. కానీ రెండింటికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. రాబోయే తరాల కోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ చట్టాల వల్ల దేశంలో ముస్లింలకు మరియు ఇతర వర్గాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇదే తరుణంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీ అవడానికి త్వరలో సిద్ధం కాబోతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు.

 

ఈ రిజర్వేషన్లు అంశాలకు సంబంధించి త్వరలోనే సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రానుందని, ముస్లింల అభ్యున్నతికి ఉపకరించే ఆ బిల్లుపై మంచి న్యాయవాదులను పెట్టి వాదించాలని తాను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించానని మజ్లిస్ అదినేత అసదుద్దీన్ ఒవైసి అన్నారు. వైసిపి పార్టీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కుదిరితే ఈ విషయంపై మాట్లాడే ఆలోచనలో ఉన్నట్లు అసదుద్దీన్ అన్నారు. అలాగే ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కేరళ తరహాలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: