రైట్ టైమ్ లో రాంగ్ డెసిషన్ తీసుకోవటంలో  వంగవీటి రాధాకృష్ణ నెంబర్ వన్ అని చెప్పాలి.  బలమైన రాజకీయ నేపధ్యమున్నా దాన్ని కంటిన్యు చేయలేక నానా అవస్తలు పడుతున్నాడు. చివరకు తండ్రి వంగవీటి రంగాకున్న బలమైన రాజకీయ నేపధ్యమున్నా జనాలు తిరస్కరించేట్లుగా పరిస్ధితిని తనంతట తానే కొని తెచ్చుకున్నారనే చెప్పాలి.  ఇంతకీ విషయం ఏమిటంటే సంవత్సరాల తర్వాత రాజకీయంగా రాధా తన రూటు మార్చుకున్నట్లే కనబడుతోంది.

 

రాధా మీదున్న పెద్ద ఆరోపణ ఏమిటంటే  విపరీతమైన  బద్ధకం. ఏ విషయం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టకపోవటం, సమస్యలపై వెంటనే స్పందిచే రకం కాదు. తనకు తీరిక దొరికినపుడు మాత్రమే ఏదో మొక్కుబడిగా రోడ్లమీదకు వచ్చి కాసేపు కనబడతాడంతే. అలాంటి రాధా కొద్ది రోజులుగా రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల్లో తిరుగుతున్నారు. అలాగే విజయవాడ నగరంలో కూడా ఆందోళనలు చేస్తున్నాడు. రెగ్యులర్ గా కార్యకర్తలను కలవటం, స్ధానికులను కలిసి మాట్లాడుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

గడచిన కొద్ది రోజులుగా రాధా వ్యవహారం అతన సహజ శైలికి భిన్నంగా ఉంటోంది. నిజానికి వైసిపిలో జగన్మోహన్ రెడ్డి బాగానే ప్రాధాన్యత ఇచ్చాడు. వైసిపి యువజన విభాగానికి అధ్యక్షుడిని చేశాడు. అయితే అప్పటి టిడిపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయటంలో మాత్రం వెనకబడ్డాడు. ఐదేళ్ళుగా ఎన్ని ఆందోళనలు చేయటానికి ఎన్ని  అవకాశాలు వచ్చినా దేన్నీ ఉపయోగించుకోలేదు. విపరీతమైన బద్ధకమే అన్నింటికీ మూలమని అందరికీ తెలిసిందే.

 

సరే విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటే కావాలని రాధా పట్టుబట్టటం, మచిలీపట్నం ఎంపి లేకపోతే విజయవాడ తూర్పు అసెంబ్లీ సీటు ఇస్తామని జగన్ ప్రతిపాదించాడు. నిజానికి పై రెండింటిలో ఏది తీసుకున్నా రాధా గెలిచేవాడే. కానీ పంతానికి పోయి చివరకు పార్టీకే దూరమయ్యాడు. పోని టిడిపిలో చేరిన తర్వాత చంద్రబాబునాయుడు ఏమన్నా టికెట్ ఇచ్చాడా అంటే అదీ లేదు. కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకున్నాడు. ఘోరంగా ఓడిపోవటంతో ఇపుడు టిడిపిలో కూడా ఏమంతా యాక్టివ్ గా లేరు.  సరే కారణాలు ఏవైనా మొత్తానికి తన పాత పద్దతులను వదిలిపెట్టి యాక్టివ్ గా తిరుగుతున్నాడంటే దాని వెనకాల ఏదో పెద్ద ప్లానే ఉంటుందని అనుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: