తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని ఘోర ఓటమిని ఎదురుకుని 8 నెలలు దాటేసింది. అయితే 8 నెలలు దాటినా, రాష్ట్రంలో టీడీపీ ఇంకా పుంజుకోలేదని తెలుస్తోంది. పైగా పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది ఇంకా వెనుకబడిపోయారని అర్ధమవుతుంది. పైగా ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది సంఖ్య కూడా 21కు పడిపోయింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు వైసీపీకు మద్ధతు తెలిపారు. ఇక టీడీపీకి ఉన్న 21లో అధినేత చంద్రబాబుని పక్కనబెడితే, మిగిలిన 20 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది గొప్ప పనితీరునే ఏమి కనబరచడం లేదని తెలిసింది.

 

కాకపోతే 20 మందిలో ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం బాగానే పనిచేసుకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లు గెలిచిన నిమ్మల రామానాయుడు, విజయవాడ తూర్పు నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్, పర్చూరు నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావులు ఆయా నియోజకవర్గాల్లో మంచి పనితీరే కనబరుస్తున్నారని టాక్ వస్తుంది. వీరు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి బాగా కృషి చేస్తున్నట్లు తెలిసింది. అలాగే అధికారులని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు.

 

ఇక సాధ్యమైన మేర అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి వచ్చే పార్లమెంట్ నిధులని గద్దె విజయవాడ తూర్పులో అభివృద్ధి పనులకు ఉపయోగించుకుంటున్నారు. అటు రామానాయుడు ఏదైనా సమస్యలు పరిష్కారం కాకపోతే, అధికారుల ఆఫీసుల ముందు దీక్షలకు కూడా దిగుతున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో తిరిగేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇటు పర్చూరులో ఏలూరి బాగానే కష్టపడుతున్నారు. తనకున్న పరిచయాలతో నియోజకవర్గంలో పనులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ ముగ్గురు కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: