తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 17వ తేదీన కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు కేటీఆర్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజుని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా కేటీఆర్ ఇచ్చేందుకు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తండ్రికి తగ్గ తనయుడిగా తనకు తాను నిరూపించుకునేలా కేటీఆర్ తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో  పార్టీని విజయం వైపుగా తీసుకువెళ్లి తండ్రికి ఇప్పటికే గుర్తుండిపోయే గిఫ్ట్స్ చాలా ఇచ్చారు. 


ఈ పుట్టినరోజు సందర్భంగా భారీ స్థాయిలో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే కేసీఆర్ తో పాటు ప్రజలకు ,పర్యావరణానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు .కెసిఆర్ కు మొక్కలను గిఫ్ట్ గా ఇవ్వాలంటూ అధికారులకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా తలో మొక్కను నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేవలం ఇది కేసీఆర్ పుట్టినరోజు అని మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతగా దీనిని నిర్వర్తించాలని ఆయన కోరుతున్నారు. 


 ప్రతి ఒక్కరూ ఒకో మొక్కను నాటాలని, ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని శాలువాలతో సన్మానాలు చేసేకంటే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటితే పర్యావరణానికి మంచి జరగడంతో పాటు కేసీఆర్ కూడా ఆనందిస్తారని కేటీఆర్ అధికారులకు పిలుపునిస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా లక్ష మొక్కలను నాటించేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. ఎలాగూ కేసీఆర్ కు మొక్కలంటే ఇష్టం కనుక ఆయన కూడా ఆనందం వ్యక్తం చేస్తారని, ప్రజలకు కూడా మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుందని కేటీఆర్ భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: