తన బావ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒకే ఒక్క కోరికతో తనకు వచ్చే మంత్రి పదవిని సైత వదులుకోవడానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణా రెడ్డి సిద్ధపడినట్టు సమాచారం. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదు… కానీ మా బావ ఎంపీ సీటును త్యాగం చేశారు.. ఆయనకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఏదో ఒక మంచి పదవి ఇస్తారని ఆశపడ్డాను. కానీ ఎక్కడా మా బావ పేరు వినిపించటం లేదు అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన బందువులతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

 

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డికి స్వయాన బావ అయిన అయోధ్యరామిరెడ్డి 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014, 2019లలో మళ్లీ పోటీ చేసే అవకాశం అయోధ్యరామిరెడ్డికి ఏ కారణాలతోనో సీఎం జగన్‌ అవకాశం కల్పించలేదు. ఒకసారి ఎన్నికలలో ఓడిపోయి ఆర్దికంగా మా బావ దెబ్బతిన్నారు. మరో రెండు సార్లు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా.. జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేయలేదు.

 

అలాంటి అయోధ్యరామిరెడ్డికి ఈ సారి రాజ్యసభ సీటు అయినా ఇప్పించాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారట. ముఖ్యమంత్రి జగన్‌ మెప్పు పొందేందుకు ఆళ్ల చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. మంత్రి పదవి దక్కకపోయినా.. గుంటూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల కన్నా ఆయనే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ బావ అయెధ్యరామిరెడ్డికి కూడా ఏదో ఒక ముఖ్యమైన పదవి ఇప్పించాలని ఆళ్ల తపన పడుతున్నారట.

 

నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదు. మా బావకు రాజ్యసభ పదవి ఇవ్వండి అని ఆళ్ల జగన్‌ను కలిసి చెప్పబోతున్నట్లు తెలిసింది. బావ కళ్లలో ఆనందం చూడాలనే బావమరిది కోరిక నెరవేరుతుందా…? ముఖ్యమంత్రి జగన్‌ ఆళ్ల కోరికను తీరుస్తారా..? మరి కొంత కాల వేచి చూడాలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: