ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన వాడు అంటూ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ ఓ డైలాగ్ చెబుతాడు. ఈ తరం నాయకులకు అది సరిగ్గా పనికొచ్చే డైలాగ్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే డైలాగ్ ఫాలో అయ్యాడు.. విజయం సాధించాడు ఎలాగంటారా...? ఢిల్లీని కొన్ని రోజులుగా.. షహీన్ భాగ్ ఆందోళనలు కుదిపేస్తున్నాయి.

 

 

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌భాగ్‌లో 60 రోజులుగా ఎడతెగని నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఢిల్లీ ఎన్నికల వేళ ఇది కూడా ఓ ఎన్నికల అస్త్రంగా మారింది. ఈ ఆందోళనలను అడ్డుపెట్టుకుని మెజారిటీ ఓటర్లయిన హిందువుల, ముస్లిమేతరుల ఓట్లు కొల్లగొట్టాలని.. బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఈమేరకు హిందూ నాయకులతో ప్రచారం చేయించింది. అయితే ఈ విషయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం చాలా సంయమనంతో వ్యవహరించారు.

 

 

మొదట్లో ఈ ఆందోళనలు సంఘీభావం ప్రకటించి ఉద్యమ బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నా.. ఆ తర్వాత బీజేపీ వ్యూహం గమనించి కాస్త వెనక్కు తగ్గాడు. అంతకు ముందు వరకూ అన్నీ తానై అన్నట్లుగా ఆ ప్రదర్శనలను ముందుండి నడిపి, సంఘీభావం తెలిపినా... కొన్ని రోజులుగా ఆ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా సైలంట్ అయ్యారు. ఈ షహీన్‌భాగ్‌’ అల్లర్ల విషయంలో అతి చేస్తే మొదటికే మోసం వస్తుందని అరవింద్ కేజ్రీవాల్ భావించాడు. అందుకే వ్యూహం మార్చేశాడు.

 

 

మైనారిటీ ఓట్ల మాటేమో గానీ మెజారిటీ వర్గం ఓట్లకు గండిపడకుండా చూసుకున్నాడు. అలా ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ ముందుకెళ్లాడు అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ పన్నిన వల్లో పడకుండా.. ఆ బీజేపీనే తన ట్రాప్ లో పడేలా చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ సక్సస్ అయ్యాడు. కేవలం సుపరిపాలనే కాదు.. రాజకీయ వ్యూహాలు కూడా అవసరం అని గుర్తించి అందుకు అనుగుణంగా అడుగులు వేయడం కేజ్రీవాల్ కు లాభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: