గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సారి వచ్చిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ స్పష్టమైన మెజార్టీ స్థానాలు అత్యధిక స్థానాలు దక్కించుకుంది. కేంద్రంలో స్ట్రాంగ్ గవర్నమెంట్ నిలబెట్టింది. అయితే ఎప్పుడైతే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ రావటం జరిగిందో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పడానికి తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇటీవల బిజెపి తీసుకువచ్చిన nrc మరియు cab బిల్లులకు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. చాలా రాష్ట్రాలు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర మరియు ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాలలో ఎన్నికలు రాగా రెండు రాష్ట్రాలలో బిజెపి పార్టీ కుప్పకూలిపోయింది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో చాలా దారుణంగా అంచనాలకు ఏమాత్రం అందుకునే విధంగా లేకుండా బిజెపి పార్టీ ఢిల్లీ ప్రజలు ఏమాత్రం మెప్పించలేకపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం కౌంటింగ్ మొదలైన గంటలోపే ఆమ్ ఆద్మి పార్టీకి 54 సీట్లు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

 

బిజెపి 15 సీట్ల వద్దే ఉంది. కాంగ్రెస్ ఒక సీటులోనే ఆదిక్యతలో ఉంది. మొత్తం డెబ్బై స్తానాలు ఉన్న డిల్లీ అసెంబ్లీ లో గత సారి 67సీట్లు సాదించి ఆమ్ ఆద్మి పార్టీ రికార్డు సృష్టించింది. ఈసారి మళ్లీ అదికారంలోకి అరవింద్ కేజ్రీవాల్ వచ్చే అవకాశం ఉన్నట్లు వస్తున్న ఫలితాలు తెలియజేస్తున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఈ మాత్రం ఆదరణ ఢిల్లీలో దక్కడానికి కారణం ఆయన అమలు చేసిన వివిధ అబివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు అని అంటున్నారు. దీంతో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి పార్టీ కూప్ప కూలిపోవడంతో రేపు రాబోయే బెంగాల్‌, బిహార్‌లో సేమ్ రిజ‌ల్టేనా వచ్చేది..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: