రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. అయితే పెంచిన చార్జీల భారం పడేది మాత్రం చాలామంది మాత్రమే. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి  జనాలందరి మీద భారీ పడిపోయిందంటూ బ్యానర్ కథనాలు రాసేసింది.  ఇంతకీ విషయం ఏమిటంటే  పెంచిన విద్యుత్ చార్జీల వల్ల భారం పడేది  విద్యుత్ వినియోగదారుల్లో కేవలం 1 శాతం మాత్రమే.  ఇంత  దానికే జగన్మోహరెడ్డి ప్రభుత్వంపై బురదచల్లటానికి ఎంత ప్రయత్నం చేస్తోందో అర్ధమైపోతోంది. అందుకనే జగన్ దీన్ని ఎల్లోమీడియా అంటున్నది.

 

పెంచిన విద్యుత్ చార్జీల భారం పడేది ఎవరి మీదనయ్యా అంటే నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్ వాడేవారికి మాత్రమే. గృహవిద్యుత్ వాడే వాళ్ళ సంఖ్య రాష్ట్రం మొత్తం మీద 1.45 కోట్లమంది ఉన్నారు. వీళ్ళల్లో  నెలకు 500 యూనిట్లు వాడే వాళ్ళ సంఖ్య 1.35 లక్షలు మాత్రమే. అంటే 1.45 కోట్లమంది వినియోగదారుల్లో 1.35 లక్షలంటే ఎంత ? కనీసం ఒకశాతం కూడా లేదు. అయినా నెలకు 500 యూనిట్ల విద్యుత్ వాడుతున్నారంటే కచ్చితంగా  ఎగువ తరగతుల వాళ్ళే అయ్యుంటారనటంలో సందేహం లేదు. ఏసిలు, రెఫ్రిజిరేటర్లు, గీజర్లు, గ్రైండర్లు, మిక్సీలు బాగా వాడే వాళ్ళు కూడా పేదల క్రిందకే వస్తారా ?

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పెంచిన విద్యుత్ చార్జీల భారం పడేది కేవలం ఒక్కశాతం మంది వినియోగదారుల  మీద మాత్రమే అని ఎల్లోమీడియానే చీమంతా అక్షరాలతో లోపలెక్కడో రాసింది. బ్యానర్ మాత్రం తాటికాయంత హెడ్డింగులతో జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరకత పెంచేట్లుగా కథనాలు అచ్చేసింది.

 

ఇదే పద్దతిలో 2014లో  అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచితే మాత్రం ఎల్లోమీడియా రెచ్చిపోయి రాలేదు. పైగా చార్జీల పెంచటం రాష్ట్రాభివృద్ధి కోసమేని, ప్రజలు అర్ధం చేసుకోవాలంటూ నీతి కథలు చెప్పింది అప్పట్లో. అంటే ఒకే అంశంపై చంద్రబాబు విషయంలో ఒకలాగ జగన్ విషయంలో మరోలాగ కథనాలు ఇస్తోంది కాబట్టే జనాలు కూడా దీన్ని ఎల్లోమీడియాగా నిర్ధారించేశారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: