ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌బుత్వంపై విరుచుకుప‌డే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఫుల్లుగా సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి ప‌రిణామాల‌కు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌ను అప్ప‌టి వ‌ర‌కు ఒడ్డున ప‌డేయొచ్చును కానీ, దీర్ఘ‌కాలంలో చూస్తే.. మాత్రం చేటు చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం.. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావు,  టీడీపీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేశ్‌ నివాసాల్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

 

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శ్రీనివాస్‌కు చెందిన వాల్ లాకర్ నుంచి భూ లావాదేవీలకు సంబం ధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ నుంచి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్‌ దంపతుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నా రు. మ‌రింత లోతుగా కొన్ని కీల‌క విష‌యాలపై విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమా చారం. 

 

తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మ‌రి పార్టీకి చెందిన కీల‌క వ్య‌క్తులు, త‌మకు వ్య‌క్తిగ‌తంగా సేవ‌లు అందించిన వారు ఐటీ బారిన ప‌డిన స‌మ‌యంలో చ‌క్రం అడ్డం వేయ‌డమో.. దీనిపై స్పందించి బాధితుల్లో ధైర్యం నింప‌డ‌మో చేయాల్సిన చంద్ర‌బాబు అలా చేయ‌డం మానేసి.. మౌనం పాటించ‌డం వ‌ల్ల మొత్తానికే న‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

గ‌తంలో బీద మ‌స్తాన్ రావు వ్యాపారాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు కూడా బాబు మౌనం వ‌హించారు. ఫ‌లితంగా ఆయ‌న పార్టీ మారిపోయారు. ఇక‌, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుపై సీబీఐ దాడులు చేసిన‌ప్పుడు కేసు న‌మోదు చేసిన‌ప్పుడు కూడా బాబు సైలెంట్ అయ్యారు. ఇలా చెప్పుకొంటే చాలా మంది ఉన్నారు. వీరంతా పార్టీకి దూరం కావ‌డానికి బాబే కార‌ణంగా క‌నిపిస్తున్నారు. సో.. ఇప్ప‌టికైనా బాబు స్పందించాల‌నేది సీనియ‌ర్ల మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: