కరోనా పై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత్ కుమార్ వేటుకు  గురైన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్ వసంత్  కుమార్...గాంధీ  ఆస్పత్రి కి పెట్రోల్ బాటిల్ తో  వచ్చి  ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. కాసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి చేరుకున్న డాక్టర్ వసంత్ కుమార్... తన వెంట బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఆ పెట్రోల్ తో ఒంటి మీద పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించ గా... వేటుకు గురైన గాంధీ ఆసుపత్రి వైద్యులు వసంతకుమార్  ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో ఉన్న వసతుల లేమిపై   ప్రశ్నించినందుకే తనపై వేటు వేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 ఈ విషయంపై మంత్రిని  కలిసానని కానీ మంత్రి నుంచి కూడా సానుకూలంగా స్పందించ రాలేదని  ఎలాంటి హామీ లభించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత్ కుమార్. తాను చేయని నేరానికి శిక్ష అనుభవించటానికి సిద్ధంగా లేను అంటూ తెలిపిన వసంత కుమార్... దీనిపై గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే వసంత్ కుమార్  ఎవరిని దగ్గరకు రా లేకపోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ ఆస్పత్రిలో వసతుల దీనిపై తాను ప్రశ్నించడంతో.. గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ డిఎంఈ కుమ్మక్కు అయ్యి తనపై వేటు వేశారు అంటూ ఆరోపించాడు డాక్టర్ వసంత్. 

 


 ఉన్నత అధికారులు నాపై కుట్ర చేసి అంత చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా అంతకు ముందుగా కరోనా  వైరస్ వ్యాప్తి పై తప్పుడు సమాచారం ఇచ్చాడు అంటూ గాంధీ ఆస్పత్రి వైద్యుడు అయిన వసంత్ కుమార్ పై వేటు పడింది. ఆస్పత్రి క్యాజువాలిటీలో   పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ ను  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు  సరెండర్ చేస్తున్నట్లు వైద్య శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. గాంధీ ఆస్పత్రిలో రెండో కరోనా  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తలు.. నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అవాస్తవమని తెలియడంతో ఈ ఈ వార్తలపై ఆస్పత్రి వర్గాలు విచారణ కమిటీ వేసాయి... ఇలాంటి వార్తలు రావడానికి కారణం డాక్టర్ వసంత్ కుమార్ తప్పుడు సమాచారం అందించడమే అని స్పష్టమైంది. ఈ క్రమంలోనే డాక్టర్ వసంత్ కుమార్ పై వేటు గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారులు... ఆయనకు సహకరించిన మరో డాక్టర్ కు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: