కాసేపటి క్రితమే మీడియా సమక్షంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన అంబటి... బాబుని పలు అంశాలపైన కడిగి పారేసారు. కావాలనే ఆయన అమరావతిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అమాయక రైతులను పురిగొల్పి..  అమరావతిలో భూములను మరింత దోచుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అర్ధంకాని రైతులు బాబుకి వత్తాసు పలుకుతున్నారని, వారు రియలైజ్ అవ్వాలని ఈ సందర్భంగా వారిని వేడుకున్నారు. గతంలో కూడా అంబటి రకరకాల అంశాలపై బాబుపై విరుచుకుపడిన సందర్భాలున్నాయి.

 

గతంలో ...టీడీపీ కార్యకర్తల డేటా వైసీపీ చోరీ చేసిందన్న వ్యాఖ్యలపై అంబటి సెటైర్ వేశారు. ఆ పార్టీ కార్యకర్తల డేటా తీసుకుని తాము నాలుక గీసుకుంటామా అని ఎద్దేవా చేశారు. డేటా చోరీ విషయంపై చంద్రబాబు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు. డేటా చోరీ వివాదాన్ని రెండు రాష్ట్రాల మధ్య యుద్ధంగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సేవామిత్ర యాప్‌లో ఆధార్ డేటా ఎందుకు ఉందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదన్నారు. అసలు సత్తెనపల్లి నియోజకవర్గంలో తన ఓటు, తన కుటుంబం ఓట్లను కూడా తీసివేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు గతంలో. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు. ఉచ్చరించరాని పదాలతో తిడుతున్నారని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 13, 2019) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ,, చంద్రబాబు హౌస్ ను డిజార్డర్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేత తిట్లు తినే దుస్థితి ఉద్యోగులకు రాకూడదన్నారు. 

 

70 ఏళ్ల వయస్సు కలిగిన చంద్రబాబు 15 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అనకూడదని పదాలు వాడారని, వాటిని ఉచ్చరిండం కూడా సమంజసం కాదన్నారు. 70 ఏళ్లు దాటిన తర్వాత చంద్రబాబు బూతులు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే అందరూ సంతోష పడతారని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: