మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంపై చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాన్ని అనుసరించబోతున్నారా ? పార్టీ కార్యాలయం కేంద్రంగా మొదలైన వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మొదలై వ్యూహం గతంలో వేర్వేరు సందర్భాల్లో అమలయ్యిందే కానీ మూడు రాజధానుల విషయంలో మాత్రం మొదటిసారనే చెప్పాలి.

 

ఇంతకీ ఆ సరికొత్త వ్యూహం ఏమిటయ్యా అంటే జనాలనే పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇప్పించటం, లెక్చర్లు దంచటం. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయానికి వచ్చే జనాలుంటారా ? అన్నదేగా మీ సందేహం. ఉండురు కాక ఉండరు. జనాలకేమీ పిచ్చి కాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రావటానికి.

 

అయితే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చాయి కాబట్టి పార్టీ నేతలే కార్యకర్తలను వంతుల వారీగా పిలుచుకుని వస్తున్నారు. వచ్చిన వారందరూ మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుతో మాట్లాడటం, వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం తర్వాత చంద్రబాబుతో ఫొటోలో దిగటంతో  వారి టాస్క్ పూర్తయిపోతుంది. ఈ కొత్త వ్యూహం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో మొదలైంది. ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో మొదలైన వ్యూహం బాగానే వర్కవుటైనట్లే ఉంది.

 

రాజమండ్రి నుండి పెద్ద ఎత్తున నేతలను, కార్యకర్తలను బుచ్చయ్యచౌదరి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. సరే ముందే చెప్పుకున్నట్లుగా ప్రహసనం పూర్తి చేశారు. పనిలో పనిగా రాజధాని గ్రామాల్లో ఏదో ఒకదానిలో కూడా పర్యటించారు.  ఇదంతా ఎందుకు జరుగుతోంది ? ఎందుకంటే చంద్రబాబు రోడ్డెకిత్తే జనాలు కనబడటం లేదు కాబట్టి.

 

చంద్రబాబు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగినపుడు జనాలు లేకపోవటంతో పరువు పోయింది. చంద్రబాబు ఏ ఊరుకి వెళితే అక్కడి నేతలు, చంద్రబాబు సెక్యురిటి సిబ్బందితో పాటు ఎవరో కొందరు స్ధానికులు మాత్రమే పాల్గొంటున్నారు. మొన్నటి తెనాలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అవటంతో పార్టీ పరువంతా పోయింది. ఎందుకొచ్చిన గొడవనుకుని పార్టీ జనాలనే తన వద్దకు పిలిపించుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: