సినిమారంగంలో మరియు మీడియా రంగంలో చక్రవర్తిగా పేరొందిన రామోజీరావు రాజకీయంగా కూడా చాలా పవర్ ఫుల్ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని తన పత్రికలో కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటాయని చాలా మంది రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తుంటారు. అటువంటి రామోజీరావుకి 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన కెసిఆర్ చాలా సన్నిహితంగా ఉండటం అందరికీ అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తాను అని భయంకర వ్యాఖ్యలు చేసిన ఎన్నికల్లో గెలిచాక కేసిఆర్ ప్లేట్ ఫిరాయించారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సీఎం గా ఎన్నికైన కేసీఆర్ ఓం సిటీ అనే బృహత్తర ప్రాజెక్ట్ విషయంలో రామోజీ-కేసీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. జగన్ కి బద్ద శత్రువు గా ఉండే రామోజీరావు తనకి కూడా బద్ధశత్రువు అని ప్రస్తుతం కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో రామోజీరావు ని దూరం పెట్టిన కేసీఆర్..త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.

 

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మరియు నాగార్జునతో మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల మంతనాలు జరపడం జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయటానికి కెసిఆర్ కృషి చేస్తున్నట్లు ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు టాలీవుడ్ ఈ స్టార్ హీరోలతో తలసాని భేటీ అయినట్లు సమాచారం. దీంతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తో రామోజీరావు ఫిలిం సిటీ పక్కకి వెళ్ళి పోవడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతుంది. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రామోజీరావు కి ఊహించని దెబ్బ తగిలినట్లయింది అని ఇండస్ట్రీలో కొంత మంది కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: