2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కుంకుమ పేరిట రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. అయినా గాని తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించింది. ఒక్కో డ్వాక్రా మహిళకు పదివేలు చొప్పున ఎకౌంట్ లో చంద్రబాబు సర్కార్ ఆ సమయమున వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల గ్రూపులో ఒక గ్రూపులో పదుల సంఖ్యలో చాలామంది ఎకౌంటు లో చంద్రబాబు వేసిన ఈ డబ్బు ఏ మాత్రం ఎలక్షన్ సమయంలో పని చేయలేక పోయింది. మూడు విడతల్లో చంద్రబాబు ప్లాన్ చేసిన రెండు విడతలు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది.

 

మూడో విడత ఎన్నికలయ్యాక గెలిచాక వెయ్యాలని భావించిన చంద్రబాబు కి ఏపీ ప్రజలు దిమ్మతిరిగిపోయే విధంగా తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబు మహిళలకు ఇచ్చిన నిధులు వివిధ శాఖల నుంచి డబ్బులు మళ్లించడంతో ఇప్పుడు ఆయా శాఖల్లో నిధులు కొరత ఏర్పడిందట. ఆ కొరత ఎంతగా ఉంది అంటే… కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లు ముద్రించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు. దీంతో అప్పట్లో ఎన్నికలయ్యాక అధికారంలోకి వచ్చాక జగన్...చంద్రబాబు పనితీరు పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.

 

అయితే ఇప్పుడు అధికారం లోకి వచ్చిన జగన్ గతంలో చంద్రబాబు మాదిరిగానే అమ్మబడి పథకానికి వివిధ శాఖల నుండి డబ్బులు ఇవ్వడానికి నిధులు మళ్లించడం జరిగిందట. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీంతో ఇంత మొత్తంలో నిధులు మళ్లడంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద వచ్చిన నిధులను అమ్మ ఒడి పథకానికి జగన్ మళ్లించినట్లు ఆరోపణలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ పరిణామంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం ధర్నాకు దిగింది.

 

ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ కింద తమకు నిధులు ఇవ్వాలని, ఇప్పటికే ప్రభుత్వం తమకు చాలా బాకీ పడినట్టు యాజమాన్యం ఆరోపిస్తోంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు చిన్న పిల్లల చదువు కోసం కాలేజీలో ఉన్న విద్యార్థుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆడుకోవటం దారుణమని  కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆరోపణలు ఎక్కువ అవటంతో ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయే అవకాశం ఉందని ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వైసీపీ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: