అయ్యో.. అయ్యో.. అంత అనుకున్నట్టే చేశారే... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అంత అనుకున్నారట.. ఇప్పుడు అలానే చేశారు ఏపీ సర్కార్ .. ఏం అనుకున్నారు? ఎవరు అనుకున్నారు? అనుకుంటున్నారా? ఎవరు అనుకున్నారు అంటే రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు.. ఏం అనుకున్నారు అంటే.. టీడీపీ నేతలకు భద్రత తొలిగిస్తారు అనుకున్నారు.

                 

ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాగానే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఉన్న భద్రతను తగ్గించారు. జెడ్ క్యాటరిగి ఉన్న లోకేష్ కి భద్రత తగ్గించారు. అప్పట్లో లోకేష్ కి 5+5 భద్రత ఉండేది. 

                 

అలాంటిది 2 +2కు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం అప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన ఇతర కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించారు. ఇలా కుదించినప్పుడే అందరూ రాజకీయ విశ్లేషకులు భావించారట.. త్వరలో మిగితావారికి కూడా భద్రతా తగ్గిస్తారు అని. 

                 

అలానే తగ్గించడం కాదు పూర్తిగా తొలిగించింది సీఎం జగన్ సర్కార్.. మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉన్న 1+1 గన్ మెన్ల భద్రత తొలగించారు. జేసీ సోదరులకు, పరిటాల శ్రీరామ్ కు గన్ మెన్లను తొలగించింది. మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జెసి దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు లకు కూడా భద్రత తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా చివరికి రాజకీయ విశ్లేషకులు అనుకున్న నిర్ణయాన్నే తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: