మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రాజధాని చుట్టూ తిరిగాయి. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు విషయంలో అమరావతి రాజధానిలో ఉన్న రైతులు తీవ్ర స్థాయిలో సీరియస్ అవ్వటం మాత్రమే కాకుండా దాదాపు 50 రోజులకు పైగానే ధర్నాలు నిరసనలు చేపట్టారు. ఇంకా చేపడుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ అంటూ వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల బిల్లు మరియు సిఆర్డిఏ రద్దు బిల్లులపై తీవ్ర సందిగ్దత అధికార పార్టీల్లో నెలకొంది. శాసన మండలి రద్దు ఈ నిర్ణయంతో ఆంధ్రాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడం తో శాసన మండలి రద్దు నిర్ణయం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ఈ నేపథ్యంలో తాజాగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాలకు సంబంధించి సెన్సేషనల్ న్యూస్ తెరపైకి వచ్చింది.

 

అదేమిటంటే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి ప్రభుత్వం మండలిలో ఆమోదానికి పంపితే మండలి తిరస్కరించడమే కాకుండా మండలి ఛైర్మన్ షరీఫ్ ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతామని అప్పట్లో చెప్పినా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఇటువంటి నేపథ్యంలో ఈ బిల్లులపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాశ్‌చంద్రబోస్ ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించినట్టే అని బాంబు పేల్చారు.

 

మండలిలో ఈ బిల్లులను ప్రవేశపెట్టి 14 రోజులు ముగిసినందున ఆ రెండు బిల్లులు ఆమోదం పొందినట్టే అని, విపక్ష పార్టీకి ఇక ఆప్షన్లు లేవని అన్నారు. ఇంకా రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వాదనను subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ తోసిపుచ్చారు. అంతేకాకుండా ఈ బిల్లులు త్వరలోనే గవర్నర్ ఆమోదముద్ర పొందుతాయి అని తెలిపారు.  సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు డిప్యూటీ సీఎం పెళ్లి సుభాష్ చంద్ర బోస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద కాక పుట్టిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: