భారతదేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూసిన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లే ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో మట్టికరిపించగా కాంగ్రెస్ అయితే అసలు పోటీలోనే లేకుండా అతి దీనమైన స్థితిలో కి వెళ్ళిపోయింది. క్రితం సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికన్నా ఎక్కువగానే చిత్తుచిత్తుగా బీజేపీని ఓడించినప్పటికీ ఎన్నికల్లో వారి విజయంపై కొద్దిగా సందేహం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 7 కి 7 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని ఆప్ ను చావు దెబ్బ కొట్టింది.

 

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చూసింది ఒకే ఒక్కడు వైపు. అతనే ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన సేవలు అందించిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పని చేశాడు. అయితే ప్రశాంత్ కిషోర్ సత్తా గురించి మన తెలుగు వారికి కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా ఆయన అక్కడ కేజ్రీవాల్ కు సూచించిన కొన్ని అద్భుతమైన వ్యూహాలు మరియు సలహాలను చూస్తే మీరు అతనిని మెచ్చుకోకుండా ఉండలేరు.

 

 

ముఖ్యంగా ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితం అని కొత్త చట్టం పెట్టడం దేశంలోనే ఒక కొత్త రకమైన ఊపూని తీసుకొని వచ్చింది. అది సూచించింది ప్రశాంత్ కిషోరే నట. కేజ్రీవాల్ ప్రశాంత్ కిషోర్ ని ఎంతగా నమ్మాలంటే ప్రశాంత్ కేజ్రీవాల్ తో సహా ఆప్ నాయకులందరినీ తమ సమావేశాలలో ఎప్పుడూ జాతీయతా భావాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయవద్దని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేదాకా. ఇలా అతనిని పనికి తీసుకున్న వారినే ఆదేశించే స్థాయిలో అతను చెలరేగుతున్నాడు అంటే అసలు ఎవ్వరూ నమ్మరు.

 

 

అలాగే బిజెపి బలహీనతల పై ఒక పక్క దెబ్బ కొడుతూ ఇన్ని రోజులు తాము చేసిన మంచి పనులను ఎక్కడ వారికి అనుకూలంగా మలుచుకునేందుకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా స్టేట్మెంట్లు ఎలా ఇవాలి అన్న తరహాలో ఇతను బాగా వ్యూహాలు రచించాడు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విలువ దేశంలో బాగా పెరిగిపోయి తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీకి తన సేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: