ఛీ.. కాలం ఎంత దారుణంగా ఉందంటే? అసలు చెప్పలేని పరిస్థితి. దారుణమైన పరిస్థితి ఇది.. ఎంత కాదు అనుకున్న తప్పని పరిస్థితి ఇది. మగమృగాళ్లు ఎంత నీచానికైనా ప్రవర్తిస్తారు.. ఆడది ఇంట్లో ఉన్న.. బయట ఉన్న అవే పరిస్థితులు.. ఆడది కనిపిస్తే చాలు హింసిస్తారు.. కొందరు మాటలతో హింసిస్తే.. మరికొందరు చెప్పకూడదు.. 

 

ఈ తరహాలోనే ఓ నీచ నికృష్టపు వెధవ బరితెగించాడు..  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అయినా సిరిసిల్లలో దారుణం చోటు చేసుకుంది.. సిరిసిల్లలోని ఎస్సి హాస్టల్ లో క్యాటరింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న దేవయ్య అనే ఓ నీచుడు విద్యార్థినీలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

 

అలా పాల్పడుతున్న నీచుడిని దండించడం పక్కన పెట్టి అతడికి అక్కడ వంట మనిషిగా పనిచేస్తున్న విజయమ్మ అనే మహిళా కూడా అతడికి సహకరించింది. దేవయ్య మాపై ఇలా నీచానికి దిగుతున్నాడు అని వెకిలి చేష్టలు చేస్తున్నారు అని విద్యార్థులు చెప్తే.. డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా.. అంటూ దేవయ్యకు వత్తాసు పలికెదట ఆ రాక్షసి. 

 

అసలు ఆడపిల్లలకు అండగా ఉండాల్సింది పొయ్యి.. ఎంత నీచానికి దిగ్గజారిందో చుడండి ఆ మహిళా.. దీంతో దేవయ్యను.. ఆ మహిళా వంట మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇంకా ఆ హాస్టల్ కి వార్డెన్ గా ఉండే భూదేవిని కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేసారు.. 

 

అయితే ఇక్కడ కోపం తెప్పించే మరో వార్త ఏంటి అంటే.. ఆ నీచుడు దేవయ్య అధికార పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాడట.. పార్టీని అడ్డుపెట్టుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాట.. అయితే దేవయ్య చేసిన నేరం తెలియడంతో దేవయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేశారట టిఆర్ఎస్ నాయకులూ..  

 

ఇలా ఉన్నారు నీచులు.. ఇలాంటి నీచులను ఏం చెయ్యాలి? ఆడపిల్ల బయటకు వెళ్లి అత్యాచారానికి గురైందని కన్నీరు పెట్టుకుంటూ వార్త రాస్తే.. ''అది ఆ టైమ్ లో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి?'' అని సోషల్ మీడియాలో రేపిస్టులకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తారు కొందరు నీచులు... ఇప్పుడు ఈ ఘటన చూస్తే ఏం అని పెడుతారు కామెంట్లు? వాళ్ళు బయటకు వెళ్ళలేదు.. ఎక్సపోజ్ చెయ్యలేదు.. హాస్టల్ లో బుద్దిగా ఉంటున్న ఆదిపిల్లలపై లైంగిక దాడి చేశాడు నీచుడు.. ఇలాంటి నీచులను ఏం చెయ్యాలో చెప్పండి ఇప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: