నిన్న జరిగిన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అయితే అసలు పోటీలను లేకుండా ఘోర అవమానాన్ని పెట్టుకుంది. పక్కా ప్రణాళికతో లోక్ సభ ఎన్నికల సమయంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి విజయ ఢంకా మోగించింది. అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో అద్భుతమైన మెజారిటీ సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో హఠాత్పరిణామం చోటు చేసుకుంది.

 

నిన్న వెల్లడైన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యేపై అర్ధరాత్రి జరిగిన కాల్పులు ఇప్పుడు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. మెహ్ రౌలీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన నరేష్ యాదవ్ దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. అనంతరం అతను తన కాన్వాయ్ లో అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే నిందితులని ఎవరూ గుర్తుపట్టకపోగా సంఘటనలో ఆమ్ఆద్మీ పార్టీ కార్యకర్త అశోక్ మన్ చనిపోగా ఇంకొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

మొత్తానికి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా సురక్షితంగా బయటపడ్డాడు. అయితే దాడి జరిగిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ జరిగిన విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించి తమ కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయామని సంఘీభావం తెలియ జేసింది. ఇప్పటికే పోలీసులు విషయంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా ఇది పక్కా రాజకీయ పరమైన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: