2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కొక్కటిగా ఆయన అనుయాయుల, పార్టీ నాయకుల లీలలు బయటకు వస్తుండటంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఆయన కాస్త అదుపు తప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా ఆయన ఓటర్లను ఉద్దేషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

 

ఓటర్లు వెయ్యో, రెండు వేలో ఇస్తే వారికే ఓట్లు వేస్తున్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పైసలు ఇస్తే డెవెలప్‌మెంట్ కూడా మరచిపోయి ఓట్లు వేసేస్తున్నా రన్నారు. విజయవాడ శివారు కానూరు లో మంగళవారం జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారని, అయితే ప్రజలు తప్పు చేసినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం నిజాయితీగా ఉండాలన్నారు.


అంతేకాదు ఈ అంశాల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమం గురించి మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని పూర్తిగా మహిళలే ముందుండి నడిస్తున్నారన్నారు. విశాఖలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 33 వేల ఎకరాల ఆక్రమించారని, అందుకే రాజధానిని అక్కడి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఏప్రీ ప్రభుత్వం విధ్యుత్‌ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడ ఆయన తప్పుపట్టారు.

 

విధ్యుత్ చార్జీల పెంపుతో దాదాపు 1300 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయని, దాదాపు 18 లక్షల రేషన్‌ కార్డులు తొలగించారిన ఆరోపించారు. అయితే జగన్‌ ప్రభుత్వం మాత్రం టీడీపీ నాయకుల కేసల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్‌ సన్నిహితుల అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తోంది. వరుసగా ఐటీ దాడులు, కోర్టు కేసులతో బాబు అండ్ టీం ఉక్కిరిబిక్కిరవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: