ఢిల్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్మ్ ఆద్మీ పార్టీ సంబరాల్లో మునిగి తేలుతుంది. వరుసగా మూడవ సారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టించడంతో వారి ఆనందానికి అవాధులు లేకుండా పోయాయి. ఒక సాధారణ వ్యక్తి స్థాయి ఢిల్లీ పీఠం వరకు కేజ్రీవాల్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. అప్పటి వరకూ ఉన్న సాంప్రదాయ రాజకీయాలకి అతీతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు.

 

 

ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ సాధించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో, ప్రధాని నివాసముండే ప్రాంతంలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ జెండాని ఎగరవేస్తున్నాడంటే ఆ ప్రభుత్వం మీద ప్రజలకి ఎంతో నమ్మకముండాలి. ప్రస్తుతం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉన్న లోక్ సత్తా పార్టీకి చాలా సారూప్యతలు ఉన్నాయి. 

 

 


జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ కూడా సాంప్రదాయ రాజకీయాలకి వ్యతిరేకంగా తమ సిద్ధాంతాలను తయారు చేసుకుంది. రాజకీయాల్లో మార్పు కోసం పనిచేసింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా సాధ్యమైంది..? అంటే ఇక్కడ మేజర్ అంశం ఒకటే కనిపిస్తుంది. రాజకీయాల్లో గెలవాలంటే ప్రజల్లో ఉండాలి. ప్రజల బాధలు తెలుసుకోవాలి.

 

 


వారి కష్టాలను తీర్చాలి. జనసమీకరణలు చేయాలి. కానీ ఈ మూడింటిని చేయడంలో లోక్ సత్తా విఫలమైంది. ఇక్కడే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రజల కోసం ధర్నా చేపట్టిన్ వ్యక్రి అరవింద్ కేజ్రీవాల్ జనాల గుండెల్లో నిలిచిపోయాడు. తమకోసం ముఖ్యమంత్రే ఇంతలా ఆరాటపడుతున్నాడని వాళ్లలో కలిగేలా చేశాడు. ఇక జన సమీకరణలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. అందువల్లే మన దగ్గర సాధ్యం కాని విజయం ఢిల్లీలో సాధ్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: