ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఈయనను చూసి నేర్చుకోవాలి అందరూ.. అవును.. ప్రజలతో ఎలా కలిసిపోవాలి.. ప్రజలకు ఎలా సేవలు చెయ్యాలి.. ప్రజలకు ఇచ్చిన హామీని ఎలా తీర్చాలి అనేది.. ఈయన దగ్గర అందరూ నేర్చుకోవాలి. అవును.. ఈ ఎమ్మెల్యే నిజంగానే అందరికి ఆదర్శం.. 

 

ఇలాంటి ఎమ్మెల్యేను మీ జీవితం చూడటం ఇదే మొదటిసారి. అనుకుంటున్నారా? అంత మంచిపని ఏం చేశాడు అని? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఘటన రెండు మూడు రోజుల ముందు జరిగినప్పటికీ.. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. 

 

అసలు ఏం జరిగింది అంటే.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణి. ఆమె సోమవారం ఉదయం నుంచి పురిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే ఆ గ్రామానికి రహదారి లేనందున అంబులెన్స్‌ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి చేరుకొని. 

 

గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణిని ఉంచి వారితో పాటు 5 కి.మీ. దూరం జోలీలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చి మానవత్వాన్ని, తన బాధ్యతను చాటుకున్నారు. తమ కోసం దిగి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఈ ఘటన అంత సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. 

 

కొందరు నెటిజన్లు గ్రేట్ ఎమ్మెల్యే అని పొగడగా.. మరికొందరు భిన్నంగా రిప్లై ఇచ్చారు.. నిజానికి ఆ రిప్లై లు ప్రజలను కళ్లు తెరిపించేలా ఉన్నాయి అనుకోండి.. ఆ రిప్లై లు ఏంటి అంటే? ఎమ్మెల్యే గారు 'జోలీ'లో గర్భిణీ'ని మొయ్యడం కాదయ్యా.. అక్కడ కాస్త రోడ్లు వేపించండి.. మారు మూలా గ్రామాలను కాస్త అభివృద్ధి చెయ్యండి అయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.. నిజమే కదా.. వాళ్ళు చెప్పింది కూడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: