కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. వరుసగా విజయ్‌ ఇళ్లు కార్యాలయాల మీద ఐటీ, జీఎస్టీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ టార్గెట్ చేసిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తమిళనాట మార్ఫింగ్‌ పోస్టర్‌ కలకలం మొదలైంది. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో హీరో విజయ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌లు కలిసి ఉన్నట్టుగా ఉన్న పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

 

ఈ పోస్టర్లలో  `మేము ఏపీని కాపాడుకున్నాము.. ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే్ కాపాడాలి` అనే సందేశం ఉండటం విశేషం. అయితే వారు ఏపీని ఎప్పుడు కాపాడారు. అన్న విషయం మాత్రం అర్థం కాలేదు. అయితే అదే సమయంలో విజయ్‌ అభిమానులు ఈ గొడవలోకి వైఎస్‌ జనగ్‌ను ఎందుకు లాగారు అన్న అంశం మీద కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.

 

నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ విజయం వెనుక కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌,  జగన్‌లతో పాటు ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆ పోస్టర్‌లలో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ మీద చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్లోను అందుకు తగ్గట్టుగా హింట్‌లు ఇస్తూ వస్తున్నాడు.

 

ఈ నేపథ్యంలోనే పొలిటికల్ పార్టీలు ఆయన్ను ఆయన్ను టార్గెట్ చేస్తున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయ్‌ ప్రతీ సినిమా రిలీజ్ విషయంలో సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రీకరణ జరుపుకుంటున్న మాస్టర్‌ సినిమా షూటింగ్‌కు కూడా పదే పదే అంతరాయం కలుగుతుండటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. మరి నిజంగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: