మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ పై ఐటి అధికారుల దాడిలతో తెలుగు దేశం పార్టీ వర్గాల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరింటి మీద ఐటీ అధికారులు దాడులు చేస్తారోనన్న భయాందోళనలో తెలుగు తమ్ముళ్లు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. శ్రీనివాస్ ఇంట జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల భాగోతం చిట్టా బయట పడినట్టు సమాచారం. దాంతో పాటు నల్లధనం కూడా వెలుగు చూసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మరి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికినట్లు తెలిసింది. పది పదిహేను మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సబ్ కాంట్రాక్టుల దందాలో ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసలు  కారణం ఇది అని తెలిస్తే మీకు కూడా కోపం రాకమానదు. ఇక విషయంలోకి వెళ్ళితే..

 

చంద్రబాబు నాయుడి మాజీ పిఎస్ శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎందుకు దాడి చేశారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు రాకపోవడంతో రాజకీయ కారణాలతోనే శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారని అనుకున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు శ్రీనివాస్ ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎంత దొరికిందో అధికారికంగా వెల్లడించలేదు కానీ ఒక వ్యక్తి ఇంట్లో ఐదు రోజుల పాటు సోదాలు జరపడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అసలు ఇంతకీ శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అకస్మాత్తుగా, ఏదో తెలిసి తెలియని వాళు చేసిన ఫిర్యాదుపైనో, రాజకీయ కారణాలతోనే దాడులు చేయలేదు.

 

పక్కా ఆధారాలు లభించడం వల్లే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర స చివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, సచివాలయం లోని మొదటి బ్లాకులో ఉన్నాయి. ఈ  బ్లాకు తో పాటు శాసన సభ భవనం నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజీ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ సంస్థ కు అప్పటి అధికార పార్టీ నాయకులకు చాలా దగ్గరి సంబంధాలు ఉండేవి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ జీఎస్ టీ లెక్కలు సరిగా చూపడంలేదనే ఆరోపణలతో ఇటీవల సంబంధిత అధికారులు ఆ కార్యాలయంలో పూర్తి తనిఖీలు నిర్వహించారు.

 

ఈ తనిఖీలలో కొన్ని ఇన్ వాయిస్ లు, బిల్లులు బయటపడ్డాయి. వాటితో పాటు సంస్థ నుంచి చెల్లింపుల రసీదులు కూడా దొరికాయి. వాటిపై ఎలాంటి జీఎస్ టి చెల్లించలేదు. అవతలి వ్యక్తులకు జీఎస్ టి నెంబర్లు కూడా లేవు. ఆ రసీదులు, ఇన్ వాయిస్ లు, వే బిల్లులు తదితర అన్నింటిపైనా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఇన్ వాయిస్ లు, బిల్లులు, రసీదులు చాలా వరకూ శ్రీనివాస్ పేరుతో ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

 

శ్రీనివాస్ గురించి వారు ఆరాతీయగా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అదీ కూడా ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీగా పని చేస్తూ షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో సబ్ కాంట్రాక్టు ఎలా చేస్తాడు. తదితర ప్రశ్నలు తలెత్తడంతో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయానికి అన్ని ఆధారాలు ఇచ్చారు. దాంతో వారు పకడ్బందిగా దాడి చేయడంతో షాపూర్ జీ పల్లోంజి రసీదుల మాట దేవుడెరుగు వందల కోట్ల ట్రాన్సాక్షన్లు, నల్లధనం, లెక్క చూపని ఆస్తులు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
.

మరింత సమాచారం తెలుసుకోండి: