కొంత కాలంగా ఉద్యమాల్లో బిజీ గా ఉన్న చంద్రబాబు నాయుడు. బుధవారం అన్ని ఉద్యమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ కొద్ది రోజులు గా రాజధాని గ్రామ రైతులతో కలిసి ఉద్యమం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. అమరావతి ప్రాంత రైతులతో కలిసి దీక్షలు ధర్నాలు చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు.

 

అయితే ఈ పోరాటాల నుంచి బుధవారం ఒక్క రోజు బ్రేక్‌ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు జరగనున్న రెండు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొననున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి పెళ్లికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భం గా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి బాబు వెళ్లనున్నారు. ఈ వివాహానికి హాజరైన అనంతరం టీడీపీ నేత బొల్లినేని రామారావు కుమారుడి వివాహానికి కూడా బాబు వెళతారని సమాచారం. రాత్రికి బెంగళూరు వెళ్లి ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయా వివాహా వేడుకలకు హాజరై వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించనున్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు కూడా వేడుకల్లో పాల్గొననున్నారు

 


కొద్ది రోజులుగా కేవలం రాజధాని ప్రాంతానికి మాత్రమే పరిమితమైన బాబు అన్నింటికి కాస్త గ్యాప్‌ ఇచ్చి ఇలా వేడుకలకు హాజరుకావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ మాత్రం బాబు తన అనుచరుల కోసమే ఈ ఉద్యమం చేస్తున్నారని, అమరావతిలో రాజధాని కొనసాగుతుందని వాధిస్తున్నారు. ఈ అంశాలపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అయితే ఈ పోటా పోటి ప్రెస్‌మీట్లు, ఉద్యమాలకు ఈ ఒక్క రోజు బ్రేక్‌ పడినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: