రాజకీయాల్లో కొందరి నేతల తీరు ఎలా ఉంటుందంటే నువ్వాదరికి, నేనీ దరికి ఎవరికి వారమే అన్నట్లుగా ఉంటున్నారు... ఎన్ని పదవులు అనుభవించిన పార్టీని బలోపేతం చేయడానికి మాత్రం ముందుకు రారు.. ఇలా చెప్పుకుంటున్న వారిలో బీజేపీ కీలక నేత ఒకరు ఉన్నారట. ఈయన వాజపేయి ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న ఈయనకు మహారాష్ట్ర గవర్నర్ పదవి దక్కింది.

 

 

ఇటీవల ఆయన గవర్నర్ పదవి కాలం ముగియడంతో మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఈ పెద్దాయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యహరిస్తారని అంతా అనుకున్నారట. కానీ ఇలా అనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి.. ఇదే కాకుండా బీజేపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ పెద్దమనిషి చుక్కాని లేని నావలా ఉన్న తెలంగాణ బీజేపీకి పెద్ద దిక్కు అని.. ఒక వేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ పెద్దమనిషే సీఎం అని ప్రచారం కూడా జరిగింది. ఇంత చెబుతున్న ఈ పెద్ద మనిషి ఎవరనుకుంటున్నారా. ఆయనే  చెన్నమనేని విద్యాసాగర్ రావు..

 

 

ఇకపోతే కనీసం 2023 ఎన్నికల వరకు అయినా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువాలని అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ చెందిన చెన్నమనేని విద్యాసాగర్ అటూవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అంతే కాకుండా కరీంనగర్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కనిపించిన దాఖలాలు కూడా లేవు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరుపున ఆయన ప్రచారం చేయలేదు. అలాగే సొంత జిల్లా కరీంనగర్లో పార్టీ నిర్వహించే పౌరసత్వ సవరణ సదస్సుల్లో కూడా విద్యాసాగర్ రావు పాల్గొనడం లేదు. ఆయన కేవలం హైదరాబాద్ వరకే పరిమితమవుతున్నారు.

 

 

దీంతో ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. వీలైనంత త్వరగా  బీజేపీ, తెలంగాణ లో అధికారం చేపట్టాలని ఆశపడుతున్న సందర్భంలో విద్యాసాగర్ తీరు వారికి మింగుడు పడటం లేదు. ఇదంతా గమనిస్తున్న పార్టీ వర్గాల వారు ఆయనను విమర్శిస్తున్నారట. ఈ నేపథ్యం లో విద్యాసాగర్ పయనం జాతీయ రాజకీయాల వైపేనా.. లేక రాష్ట్ర రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తారా.. అనేది తెలియడం లేదు. ఇంతకాలం పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా ఉన్న విద్యాసాగర్ తెలంగాణాలో బీజేపీని ముంచుతాడో తేలుస్తాడో అర్ధం కాక, పార్టీపరువు ఇలా నవ్వులపాలవుతున్నా చూస్తూ ఉంటున్నాడన్న విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపధ్యంలో కొన్నిరోజులు పోతేగానీ ఆయన పయనం ఎటూ వైపో క్లారిటీ రాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: