జనసేన అధినేత పవన్ కళ్యాన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.   విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్.

 

పవన్ కల్యాణ్.... ఈ రోజు, రేపు కర్నూలులో పర్యటిస్తున్నారు. 2017లో జరిగిన కర్నూలు యువతి అనుమానాస్పద మృతి వ్యవహారం.. పవన్ పోరాటంతో మరోసారి హైలెట్ అవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేనాని  ఈ రోజు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహింస్తుండటంతో.. పోలీసులు ముందుజాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  విద్యార్థినిపై అత్యంత ఘోరంగా అత్యాచారం చేయడమే కాదు.. ప్రాణాలు తీశారని ... ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు పవన్ .  అంతేకాదు నేరుగా ఆందోళన బాట పట్టారు.

 

రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహించబోతున్నారు.  జనసేన  శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొంటున్నాయి. అనంతరం కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.  రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారు.

 

మరోవైపు కర్నూలు విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో పవన్ పోరాటం ప్రారంభించడానికి ఒకరోజు ముందే పోలీసులు దీనిపై స్పందించారు.  అటు సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉందని పోలీసులు చెబుతున్నారు.  మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పాటు జరిగే టూర్ లో ప్రజా సమస్యలపై గళం విప్పనున్నారు. ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయనున్నారోనని అంతా ఆసక్తిగా చూస్తోంది. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: