ఆడపిల్లకు సమాజంలోనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. కామంతో వావి వరుసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. భాద్యతగా చూసుకోవాల్సిన తండ్రే భయాందోళనకు గురిచేస్తున్నారు.కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్పిన తండ్రే ఆమెను కాటేశాడు.సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది..! 

 

 

ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురిపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురినే బెదిరించి ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది.

 

 

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు(19), కొడుకు(15) ఉన్నారు. కుమార్తె టెన్త్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. దీంతో కన్నకూతురి పైనే ఆ కామాంధుడు కన్నేశాడు. రోజూ భార్య పొలం పనులకు, కొడుకు స్కూల్‌కి వెళ్లిన తర్వాత కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

 

 

దీంతో రాత్రివేళ భార్య, కొడుకు తినే ఆహారంలో మందు కలిపి వారు మత్తులోకి జారుకున్నాక కూతురిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దింతో బాధితురాలు మౌనంగా బాధను భరిస్తూ వస్తోంది.

 

 

ఇటీవల కుమార్తెలో శారీరక మార్పులు గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలలో ఆమె రెండు నెలల గర్భవతి అని తేలింది. దీంతో కూతురిని నిలదీయగా తండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెప్పింది. దీంతో ఆమె భర్తను ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆమె కూతురిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: