ప్రపంచం అంతా కరోనా వైరస్‌కు భయపడుతూ, క్షణం ఒక యుగంలా గడుపుతున్న విషయం తెలిసిందే.. ఏ క్షణం ఈ వ్యాధి ఎవరిని తన కోరలతో కాటువేసి ప్రాణాలు తీస్తుందో అనే భయం ప్రతి వారిలో మెదులుతూ ఉంది.. ఇక చైనాలో అయితే పరిస్దితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడున్న ప్రజలు ప్రజలే కదండీ. వారు మనలాంటి మనుషులే.. ఇక ఇప్పుడు వారి జీవన విధానాన్ని చూస్తుంటే కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారనిపిస్తుంది..

 

 

ఇకపోతే ఒక వైపు ప్రపంచం అంతా కరోనా వైరస్ నుండి తొందరగా చైనా కోలుకోవాలని ఆశిస్తుంటే, కొందరు పనికి మాలిన మనుషులు మాత్రం కరోనా వైరస్ రాకున్నా వచ్చినట్లుగా నటిస్తూ ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారట. ఆ వివరాలు తెలుసుకుంటే రష్యాలోని మాస్కో అండర్‌గ్రౌండ్ మెట్రో రైలులో చోటుచేసుకున్న ఈ ఘటన పలు విమర్శలకు తావిస్తుంది.. ఇక కరోమాత్ ఝబరావ్ అనే ఓ బ్లాగర్, అతడి స్నేహితులు రైల్లో ఒక ప్రాంక్ వీడియో తీయాలని అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టి ఇందులో భాగంగా మాస్క్ ధరించి రైలు ఎక్కి కరోనా వైరస్ అని అరుస్తూ కిందపడ్డాడు.

 

 

దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు అతడి నుంచి దూరంగా పరిగెట్టారు. కొద్దిసేపటి తర్వాత కరోమాత్ తనకు వైరస్ లేదని, భయపడొద్దని ప్రయాణికులకు తెలిపాడు. ఇటీవల ఈ వీడియోను కరోమత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. మరి ఇంత గొప్ప పని చేసిన అతన్ని సన్మానించాలి కదా అందుకే ఆ వీడియో చూసిన పోలీసులు అతన్ని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుచగా, కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది..

 

 

ఇక అతని లాయర్ ఈ ఘటన పట్ల సంజాయిషీ ఇస్తూ, అతడు ఈ ఫ్రాంక్ వీడియో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని ఊహించలేదు, ఇదంతా ఒక మంచి ఉద్దేశంలో భాగంగా..  కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే వారు ఫేస్ మాస్కులు ధరించకపోతే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ప్రాంక్ వీడియో చేశాడని తెలిపారు... ఏది ఏమైనా ప్రజలంతా ప్రాణభయంతో అల్లాడిపోతుంటే దాన్ని ఇలా చెప్పవలసిన అవసరం లేదు. మరో విధంగా తెలుపవచ్చూ అని నెటిజన్స్ గుర్రుగా చూస్తున్నారట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: