ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబీ వెంకటేశ్వరావు బాగోతం పెద్ద హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వ్యవహరించారని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందటంతో కులతత్వం తో 2019 ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అప్పట్లో వార్తలు గట్టిగా వినబడ్డాయి. ఇదే తరుణంలో ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మరి పేచ్చి మీరు రెచ్చిపోవడంతో  2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం తో ఏపీ ప్రభుత్వ అధికారులలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

 

దీంతో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు బాబు హయాంలో చేసిన అవినీతి మొత్తం బయట పెట్టడం స్టార్ట్ చేసింది జగన్ సర్కార్. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లపాటు వెయిటింగ్ లిస్టులో ఉంచింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే తరుణంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని...తాజాగా ఏబీ వెంకటేశ్వరరావును...ప్రభుత్వం సస్పెండ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో స్పందించాడు.

 

జగన్ సీఎం కావడానికి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ అని నాని ట్వీట్ చేశారు. దీంతో కేశినేని నాని  చేసిన ట్వీట్‌ బట్టి చూస్తే చంద్రబాబుకి ఎన్నికల తప్పుడు సలహాలు, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా వెంకటేశ్వరరావు టీడీపీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారన్నది ఒప్పుకున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎలా ఉన్నా గాని ఏబీ వెంకటేశ్వరరావు పనితీరు గురించి వైసిపి పార్టీ సీనియర్ నాయకులు తర్వాత ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్ స్పందించక ముందే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అందరికంటే ముందే ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాడని...ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవని మొత్తం కులతత్వం తో నిండి పోయాడని అప్పట్లోనే ఆయన బహిరంగంగా మీడియా ముందు చెప్పటం జరిగింది.

 

అంతే కాకుండా తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి కరణం బలరాం ఎన్నికల ప్రచారం కంటే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన దాడులు మరియు నిర్వాకం వల్ల తన క్యాడర్ కు చెందిన మనుషులపై తప్పుడు కేసులు నమోదయ్యాయని...ఆమంచి తెలిపారు. కాగా ఏబీ వెంకటేశ్వరరావు నీ జగన్ సర్కార్ తాజాగా సస్పెండ్ చేయడంతో ఆయన గురించి వస్తున్న వార్తలు అందరికంటే ఆమంచి కృష్ణమోహన్ అప్పట్లో చెప్పిన వీడియో ఇప్పుడు బాగా ఇంటర్నెట్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: