ప్రస్తుత కాలంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. నిందితులు దేనికైనా తెగించే విధంగా ఉన్నారు. ఈ ఘటన జరిగాక మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అర్దమవుతుంది. బీదర్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న బస్సులో ఓ మహిళ బ్యాగులో నిషేదిత వస్తువులు ఉన్నాయంటూ.. దుండగులు ఆమెను బస్సు నుండి కిందకి దింపి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె పై అత్యాచారయత్నానికి ప్రయత్నించారని ఆ మహిళ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది.

 

 

అసలు వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద పోలీసులమని ఆ బస్సు లోని వారికి చెప్పి ఆ మహిళను  కిందకి దింపి ఆమె పై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఆమెను బస్సు నుంచి కిందకు దించి గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తోందని సదరు మహిళ పై ఆరోపించారు. 

 

 

 

 

 

అంతేకాదు పోలీసులమని ఆమెను బెదిరించి బాధితురాలి పై ఘటనకు ఒడిగట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దుండగులను పోలీసులు గుర్తించారు. బుధవారం వారు కారులో వెళ్తున్నట్లు గమనించి వారి వెనకాలే వెళ్తూ పోలీసులు వెంబడించారు.  ఈ క్రమంలో దుండగులు స్పీడ్ గా నడపడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక నిందితుడు మృతి చెందాడు. ఇంకా కారులో ఉన్న ఒక నిందితుడిని గాయాలు కాగా అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.  

 

 

కాగా., భాదిత మహిళ పిర్యాదు మేరకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి వారిని మంగళవారం రాత్రి నుండి పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహాభూత్పూరు వద్ద నిందితులు సీఐ ని చూడగానే కారుని వేగంగా నడిపారు. దీంతో పోలీసులు వారిని వెంబడించారు.. వెంబడించే క్రమం లో కారు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు . కాగా., గాయపడిన నిందితుడికి చికిత్స అనంతరం పోలీసులు ప్రశ్నిస్తామని తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: