చాలా కాలం తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇప్పటికే అనేకసార్లు మోడీని కలిసేందుకు జగన్ ప్రయత్నించినా వారి అపాయింట్మెంట్ దొరకక ఢిల్లీ నుంచి నిరాశగా అనేకసార్లు జగన్ వెనుదిరిగారు. తాజా గా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో సఖ్యత గా ఉండాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ దానిలో భాగంగానే జగన్ కు అపాయింట్మెంట్ ఖరారు చేసింది. ఈమేరకు ప్రధానిని కలిసేందుకు ఈరోజు క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం అమరావతి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు జగన్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారిద్దరి మధ్య ఏ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.

 

 ముఖ్యంగా మూడు రాజధానులు, అలాగే ప్రత్యేక హోదా విషయంపై జగన్ మోదీకి వివర్శితున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో తమ అంగీకారం తెలిపిన బిజెపి, ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అలాగే ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చేస్తున్న విమర్శలపై, ఆ పార్టీ నాయకులు పై జరుగుతున్న సిఐడి, ఈడీ, ఐటీ ఎంక్వయిరీ పైన మోడీ కి జగన్ వివరింకెహెబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం హోంమంత్రి అమిత్ షా ను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


మూడు నెలల తర్వాత బీజేపీ అగ్రనాయకులు అపాయింట్మెంట్ దొరకడం వారిని కలుసుకోవడంతో వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. బీజేపీ వైసీపీ కలిసి ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రధాని జగన్ మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని ప్రధాని నిర్ణయించుకున్నారనే వార్తల నేపథ్యంలో జగన్ తో ఈ విషయంపైన మోడీ చర్చించే అవకాశం ఉన్నటు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: