ఏమిటో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడుతారో ఎవరికీ అర్ధంకాదు. నిజంగానే పవన్ కల్యాణ్ తానొక అజ్ఞా(న)తవాసి అని నిరూపించుకున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ర్యాలీ, బహిరంగసభలో పవన్ మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉంది. ఇపుడే కాదు గతంలో కూడా పనవ్ ఇటువంటి తలా తోక లేని మాటలు చాలానే మాట్లాడాడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలో సుగాలిప్రీతి అనే విద్యార్ధినిపై హత్యాచారం జరిగిందట. ఆ ఘటనను ప్రస్తావిస్తు జగన్ ఏమి చేస్తున్నాడు ? పోలీసులు ఏమి చేస్తున్నారు ? అంటూ చాలా గట్టిగా నిలదీశారు. కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రీతి కేసులో న్యాయం జరగకపోతే కర్నూలులో జస్టిస్ సిటి పెట్టి ఉపయోగమేంటంటూ గ....ట్టిగా నిలదీసేశారు. నిందితులను పోలీసులు ఎందుకు దాచి పెడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు.

 

ఇక్కడ పవన్ లోని అజ్ఞానం బయటపడింది. విషయం ఏమిటంటే ఘటన జరిగింది  చంద్రబాబునాయుడు హయాంలో. ఎందుకంటే తన కూతురిపై జరిగిన హత్యాచారంపై 2015 నుండి పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టంచుకోవటం లేదని స్పష్టంగా చెప్పింది. అంటే ఘటన జరిగింది చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోనే అన్న విషయం అర్ధమైపోతంది.

 

ఘటనకు స్పందించి   ఇంత భారీ ఎత్తున ర్యాలీ, బహిరంగసభ నిర్వహించిన పవన్ మరి నాలుగేళ్ళ క్రితం ఎక్కడున్నాడు ?  బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని చంద్రబాబును ఎందుకు డిమాండ్ చేయలేదు ?  ఇందుకే పవన్ ను చంద్రబాబు జేబులోని మనిషిగా అందరూ చెప్పుకునేది.

 

బతుకంతా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేయాలని డిసైడ్ అయినట్లుంది చూస్తుంటే. అందుకే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులకు జగన్ బాధ్యత వహించాలని పదే పదే డిమాండ్ చేస్తుంటాడు.  తప్పు జరిగినపుడు ఘటన జరిగినపుడు చంద్రబాబును నిలదీయటానికి పవన్ కు నోరు రాదు మళ్ళీ.  బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేయటంలో తప్పు లేదు. కానీ  ఘటనేదో జగన్ హయాంలో జరిగినా పట్టించుకోవటం లేదనే అర్ధం వచ్చేట్లుగా మాట్లాడుతుండటమే  ఆశ్చర్యంగా ఉంది.

==

మరింత సమాచారం తెలుసుకోండి: