తప్పులు చేయడం ఎందుకు..?  తిప్పలు పడడం ఎందుకు ..? అంటూ ఇప్పుడు ఇంటలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు వంటి అధికారులు గురించి ఏపీ లో జరుగుతున్న చర్చ. ఇంటిలిజెన్స్ చీఫ్ గా టిడిపి ప్రభుత్వంలో పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం అప్పట్లోనే రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర దుమారం రేపింది. కేవలం ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన నడుచుకున్నారు అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ బాస్ గా ఉన్న సమయంలో పాల్పడిన అవినీతి వ్యవహారాలను బయటకు తీస్తోంది. ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇంకా లోతుగా ఆయన వ్యవహారాలపై దర్యాప్తు చేస్తోంది.

 


 ఏపీ లో ఉన్న ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా టిడిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్న వారు  ప్రస్తుతం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఐఆర్ఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ వ్యవహారం ఏపీ లో రచ్చ రచ్చ గా మారింది. ఆయన దాదాపు 100 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు దొరకడం తో జగన్ ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టడమే కాకుండా జీతం సైతం నిలిపివేసింది. దీంతో మళ్లీ తన ఉద్యోగాన్ని క్యాట్ ను ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే అధికారులు ఇంతవరకు వ్యవహారాన్ని ఎందుకు తెచ్చుకోవాలి అన్నది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. 

 


అధికారులు తమ నిబంధనల ప్రకారం పని చేసి ఉంటే... ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, అలా కాకుండా కేవలం ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహారాలు నడిపితే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని సూచిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరావు ను ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. చివరకు ఆయనకు సస్పెన్షన్ చేతిలో పెట్టింది. అయితే దీనిపై వైసీపీ ప్రభుత్వం పై ఎక్కడా పెద్దగా విమర్శలు రావడం లేదు. టీడీపీలోని ఒక వర్గం వారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

 


 ప్రజల్లో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం దాదాపుగా ముగిసిపోవడంతో ఆ తర్వాత ఏ అధికారి పై వైసీపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టబోతోంది అనేది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ డిజిపి ఠాగూర్ పేరు వెలుగులోకి వస్తోంది. టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యవహరించారని అప్పట్లో ఎన్నో విమర్శలు చెలరేగాయి. దీంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా ఆయనను పక్కకు తప్పించింది. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి మరోసారి అధికారుల అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: