ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అంతా సంతోష పడ్డాయి. కేజ్రీవాల్ గెలిచాడు అన్నా ఆనందం కంటే బిజెపి పార్టీ ఓడిపోయింది అన్న సంతోషమే వాళ్లకు ఎక్కువగా ఉంది. దేశ స్థాయిలో బిజెపి పార్టీ ఓటమిని చాలామంది సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే కౌంటింగ్ పూర్తి ఐనా 24 గంటలకి అందరూ సెలబ్రేట్ చేసుకుంటే వచ్చిన ఫలితాలను బట్టి చేదు నిజాలు బయటపడ్డాయి.

 

అదేమిటంటే ఢిల్లీలో బీజేపీ ఓడిపోయినా గాని దానికి ప్రత్యర్థి నాయకుడంటూ ప్రస్తుతం ఎవరు లేకపోవడమే అని...ఢిల్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయిన భవిష్యత్తులో మాత్రం బీజేపీ పార్టీ కి ఎదురుగా నిలబడి నాయకుడు లేకపోవడం ఆ పార్టీ గెలిచిన అసలు సిసలైన సక్సెస్ అని దీన్ని పెద్దగా పట్టించుకునే ఓటమి కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  ఢిల్లీ లో వచ్చిన ఫలితాలు చూస్తే ఆప్ మరియు బీజేపీ పార్టీలకు ఓటింగ్ ఉన్నా కానీ మిగతా పార్టీల పరిస్థితి ఓటింగ్ శాతం చూస్తే కనీసం అడ్రస్ కూడా లేదని...కేజ్రీవాల్ నీ కూడా పట్టించుకున్న పార్టీలు దేశంలో ఏమీ లేవని బిజెపి పార్టీకి ఇదే అతిపెద్ద విజయమని రాజకీయ మేధావులు అంటున్నారు.

 

Nrc మరియు cab వల్ల వ్యతిరేకత వచ్చినా కానీ దాన్ని ఏకం చేయ గల నాయకుడు దేశంలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టగల పార్టీ కానీ రాజకీయ నాయకుడిగానీ లేకపోవటం బిజెపి పార్టీకి అతి పెద్ద ప్లస్ అని..ఇప్పటికైనా దేశవ్యాప్తంగా బీజేపీ పతనాన్ని చూడాలనుకుంటున్న పార్టీలు నాయకులు...ఒక సరైన వేదిక ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే బీజేపీకి రోజులు దగ్గర పడ్డట్లే...అదేవిధంగా ఉత్తర భారతంలోనే బిజెపికి మూడు రాష్ట్రాల్లో ఓటమిని రావటం మామూలు విషయం కాదు ఈ టైంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకించే విధంగా కూటమి క్రియేట్ చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ కనుమరుగవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: