ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జగన్ 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ప్రజా సంకల్ప పాదయాత్ర స్టార్ట్ చేసిన నాటి నుండి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో అడుగులు వేస్తూ తన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసి తెలుగుదేశం పార్టీని మట్టికరిపించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కనుమరుగైపోయిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రాలో కనబడలేదు. కాగా తాజాగా మళ్లీ జగన్ తో ప్రశాంత్ కిషోర్ పని చేయడానికి రెడీ అవుతున్నట్లు...దీని కోసం అత్యవసర భేటీ త్వరలో జరుగుతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

 

కాగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనకాల ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఉందని అందరికీ తెలిసినదే. ఇందువల్లనే బిజెపి పార్టీ తో మిత్ర ముఖ్యంగా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ ….తన పార్టీ నుండి ప్రశాంత్ కిషోర్ ని సస్పెండ్ చేయడం జరిగింది.  ప్రస్తుతం బీజేపీ పార్టీ కి ఉత్తరాది లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో ఇదే టైమింగ్ అనుకుని ప్రశాంత్ కిషోర్ తన ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేయాలి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో పశ్చిమ బెంగాల్ లో జరగబోయే ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తో కలిసి ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నారు ప్రశాంత్ కిషోర్.

 

ఏదైనా వెంటనే మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మరియు మరికొన్ని పార్టీలను బిజెపి మరియు కాంగ్రెస్ జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రశాంతి కిషోర్ ముందుగా దక్షిణాదిలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న జగన్ ని కలిసి మంతనాలు జరుపుతున్నట్లు త్వరలోనే వీరిద్దరి అత్యవసర భేటీ జరగనున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: