ఎక్కడైనా గ్రామ పంచాయితిలో చిన్నా చితకా వాళ్ళను దండించటం విన్నాం. మరీ కాదంటే ఎవరో అనామకులను బహిష్కరించిన ఘటనలు కూడా విన్నదే. కానీ ఏకంగా ఓ ఎంఎల్సీనే గ్రామస్తులు బహిష్కరించటం మాత్రం సంచలనంగా మారింది. అందులోను  టిడిపి ఎంఎల్సీ బీద రవిచందర్  విషయంలో ఇలా జరగటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లాలో ఇసుకపల్లి అనే గ్రామముంది. ఆ గ్రామం గురించి ఈ మధ్యలో బీద రవిచందర్ మాట్లాడుతూ తమ గ్రామమంత దరిద్రమైన గ్రామం ఇంకోటి  లేదని వ్యాఖ్యలు చేశారట.  ఆ విషయాన్ని మీడియాలో తెలుసుకున్నారు గ్రామస్తులు. దాంతో గ్రామ పెద్దలంతా సమావేశమయ్యారు. గ్రామాన్ని కించపరుస్తు వ్యాఖ్యలు చేసిన ఎంఎల్సీతో గ్రామంలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 

గ్రామ పంచాయితి ఏకగ్రీవ తీర్మానాన్ని ఎవరైనా మీరి ఎంఎల్సీతో మాట్లాడితే రూ. 10 వేలు ఫైన్ కట్టాలని కూడా తీర్మానం  చేయటం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామస్తుల పంచాయితీ తీర్మానం విషయం తెలియగానే ఎంఎల్సీ ఆశ్చర్యపోయారు.  తాను తన గ్రామం ఇస్కపల్లి గురించి కించపరుస్తు ఏమీ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. తన గ్రామంలోని అపరిశుభ్ర వాతావరణం గురించి మాత్రమే మాట్లాడాను కానీ గ్రామం గురించి కాదన్నారు.

 

సరే బీద వివరణను గ్రామస్తులు ఎంత వరకూ ఆమోదిస్తారో తెలీదు. మొత్తం మీద మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి టిడిపి నేతలకు కష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయింది మాత్రం వాస్తవం. అందులోను బీద రవిచంద్ర అన్మ బీద మస్తాన్ రావు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అన్న టిడిపిలో నుండి వైసిపిలోకి మారిన తర్వాత తమ్ముడికి కష్టాలు మరింతగా పెరిగినట్లు సమాచారం. మరి తన కష్టాలను బీద రవిచందర్ ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సిందే. లేకపోతే గ్రామస్తులదే పై చేయి  అవుతుందా చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: