మనిషికి సరదాగా అయినా అలవాటు ఏదైనా చివరికి వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం ఒక్కోసారి చెడు చేస్తే, అప్పుడప్పుడు మాత్రం మంచే జరుగుతుంది.. ఇక పేదవారి జీవితంలో మంచి జరగడం అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది.. ఇలాంటి మంచే ఒక రెక్కాడితే గాని డొక్కాడని నిరూపేద కుటుంబంలో జరిగింది. ఒక వ్యక్తి తన కుంటుంబ పోషణ నిమిత్తం చేయని తప్పు లేదు, అప్పు లేదు.. అయినప్పటికి అంత కటిక పేదరికం అనుభవిస్తున్న ఇతడికి ఒక అలవాటు ఉంది. అదే అలవాటు ఈ రోజు అతన్ని కోటీశ్వరున్ని చేసింది.. ఆ వివరాలు తెలుసుకుంటే

 

 

మాల్పూర్ పంచాయతీలోని కురిచ్యా కాలనీలో నివాసముండే రాజన్ పెర్నూన్ అనే రోజువారీ కూలీ పని చేస్తూ, తన భార్య పిల్లల్ని పోషిస్తుంటాడు. ఇంత పేద వాడైనా అతనికి లాటరీల పిచ్చి ఎక్కువగా ఉందట. ఆ పిచ్చి వల్ల తాజాగా కొన్న ఒక లాటరీ టికెటుపై రూ.12 కోట్ల ప్రైజ్ మనీ తగిలింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ కింద రూ. 12 కోట్ల ఫ్రైజ్ మనీ ప్రకటించింది. అయితే రాజన్ పెర్నూన్ కన్నూరు జిల్లాలోని కూతుపారంబు పట్టణంలో ఒక వెండర్ నుంచి st 269609 లాటరీ టికెట్ కొన్నాడు.

 

 

దీనితో ఈసారి అతడికి అదృష్టం బాగా కలిసొచ్చి రూ.12 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్ పట్టుకుని స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశాడు. కాగా లాటరీ టికెట్ నిబంధనల ప్రకారం.. రాజన్ గెలుచుకున్న రూ.12 కోట్ల ప్రైజ్ మనీలో ట్యాక్సులు ఏజెన్సీ కమీషన్ పోనూ కేవలం రూ.7.2 కోట్లు మాత్రమే అతడి చేతికి వస్తాయి. ఇకపోతే ఇతనికి లాటరీ తగిలిందని అందరు లాటరీలకు బానిసలు కావలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ లాటరీ అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మాత్రం ప్రవర్తించకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: