రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తో ప్రధానమంత్రి నరేంద్రమోడికి చాలా అవసరం ఉంది. లోక్ సభలో బంపర్ మెజారిటి ఉన్న మోడి సర్కార్ రాజ్యసభలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది.  ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్షాలదే మెజారిటి. ఈ కారణంగానే లోక్ సభలో పాసవుతున్న బిల్లులు రాజ్యసభలో పాస్ చేయించుకోవటానికి బిజెపి నానా అవస్తలు పడుతోంది.

 

ఈ నేపధ్యంలోనే   జగన్ తో అవసరం చాలా ఉందని మోడి  గుర్తించారు.  ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజ్యసభలో జగన్ బలం పెరుగుతోందన్నది వాస్తవం. ప్రస్తుతం రాజ్యసభలో జగన్ కు ఇద్దరు ఎంపిలున్నారు. రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ లో మరో నాలుగు రాజ్యసభ ఎంపిల బలం పెరుగుతోంది. అంటే అప్పుడు వైసిపికి రాజ్యసభలో బలం ఆరుగురు ఎంపిలకు పెరుగుతుంది.

 

ఆంధ్రప్రదేశ్ కు మొత్తం మీద 11 రాజ్యసభ ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఏప్రిల్ ఏపి కోటాలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరావు, సీతామాలక్ష్మి, మొహ్మద్ ఆలీఖాన్, సుబ్బిరెమిరెడ్డిల పదవీ కాలం ముగుస్తోంది.  ఈ నాలుగు స్ధానాలూ వైసిపికే వస్తాయి. అలాగే 2022 జూన్ కు మరో నాలుగు స్ధానాలు ఖాళీ అవబోతున్నాయి. విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టిజి వెంకటేష్, సుజనా చౌదరి పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నాలుగుకి  నాలుగు స్ధానాలు వైసిపికే వస్తాయనటంలో సందేహం లేదు.

 

అంటే అప్పుడు రాజ్యసభలో వైసిపి బలం తొమ్మిదికి పెరుగుతుంది. మళ్ళీ 2024, ఏప్రిల్ నెలకు మూడు స్ధానాలు ఖాళీ అవుతాయి. సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ విరమణ చేస్తారు. అంటే ఈ మూడు స్ధానాలు కూడా వైసిపికే వస్తాయనటంలో సందేహం లేదు. అంటే ఏపి కోటాలో  రాజ్యసభలో ఉండే 11 స్ధానాలకు 11 స్ధానాలూ వైసిపి కే దక్కుతాయనటంలో సందేహం లేదు. ఈ విషయాలన్నీ గ్రహించే జగన్ తో ఎంత అవసరం ఉందో మోడి గ్రహించారు.  అందుకనే ఇప్పటి నుండే మంచి చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.  

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: