నాయ‌కుల‌కు స‌హ‌న‌మే భూష‌ణం. ఎన్ని మాట‌లు మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న‌ప్ప‌టికీ.. ఒక్క మాట తూలి తే.. ఎంత దూరం తీసుకువెళ్తుందో అనేక అనుభ‌వాలు మ‌న‌కు ఉన్నాయి. తాజాగా చంద్ర‌బాబు వైఖ‌రి కూ డా వివాదాస్ప‌దంగా మారుతోంది. ఆయ‌న చాలా వాక్చాతుర్యం ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నా రు. గంట ల త‌ర‌బ‌డి మీడియాతో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా.. చెప్పిందేచెప్పినా.. ఎక్క‌డా కూడా త‌డ బాటు అనేది లేకుండా.. ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టించ‌కుండా మాట్లాడ‌డంలో ఆయ‌న నేర్ప‌రిత‌నం చాలా డిఫ‌రెంట్‌.

 

ఆయ‌న ఎంత ఆవేశ ప‌డినా కూడా ఎక్క‌డా నోరు జారిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపించ‌వు. అయితే, ఇది నిన్న‌టి మాట‌. ఇప్పుడు మాత్రం ఎక్క‌డ మాట్లాడినా.. నోరు జారుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బాబులో కొంత ఆవేశం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా త‌న‌క‌న్నా చాలా చిన్న‌వాడైన జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డాన్ని బాబు అస్స‌లు స‌హించ‌లేక‌పోతున్నారు. ఇది మ‌రింత‌గా బాబులో ఫెస్ట్రేష న్‌ను పెంచేస్తోంది. దీంతో బాబు త‌న ఆవేశాన్ని ఎంత దాచాల‌ని అనుకున్నా.. దాచ‌లేక పోతున్నారు. బ యట ప‌డిపోతున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ఇలానే త‌న స‌హ‌నాన్ని కోల్పోయారు. 

 

ఏకంగా అటు ప్ర‌జ‌లు, ఇటు పోలీసుల‌ను ఆయ‌న టార్గెట్ చేసేశారు. ప్రజలు అప్పుడప్పుడూ తప్పు చేస్తున్నారు. ప్రజలు రూ.వెయ్యి, రెండు వేల ప్రలోభాలకు లొంగిపోయి తప్పు చేస్తున్నారు. దీనిపై చర్చ జరగాలి.  అని బాబు మాట‌ల‌తో క‌డిగేశారు. ఇక‌, అదే స‌మ‌యంలో పోలీసు అధికారుల‌ను టార్గెట్ చేసుకుని.. రేపు మేం వచ్చి ఇప్పుడు పనిచేస్తున్న వారి జీతాల నుంచి ఆ డబ్బును రికవరీ చేయడంతోపాటు ఈ తప్పులకు బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలా? రిటైరై వెళ్లిపోతామని కొందరు అధికారులు అనుకుంటున్నారు. కానీ రిటైరైనా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. అంటూ బాబు ఫైర‌య్యారు. 

 

ఈ రెండు ప‌రిణామాల‌కు కూడా నిన్న జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ఎలాంటి సంబంధం లేనివి. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం వీటికి లేదు. అయినా కూడా చంద్ర‌బాబు త‌న ఆవేశాన్ని అణుచుకోలేక పోయారు. ఏకంగా ప్ర‌జ‌ల‌పైనే ఆయ‌న మీరు డ‌బ్బుకు అమ్ముడు పోతారు! అనే రేంజ్‌లో వ్యాఖ్య‌లు చేయ‌డం, పోలీసులూ మీ భ‌ర‌తం ప‌డ‌తా! అనేలా బెదిరింపు వ్యాఖ్య‌లు చేయ‌డంతో అస‌లు బాబు ఎందుకు ఇలా మారిపోయార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: