నరేంద్రమోడినే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరి మరీ పిలిపించుకున్నారా ? అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. ఢిల్లీ  ఎన్నికల్లో తగిలిన గట్టి ఎదరుదెబ్బ నేపధ్యంలో కొత్త, బలమైన మిత్రుల కోసం  మోడి  వెతుకులాట మొదలుపెట్టారని సమాచారం. ఇందులో భాగంగానే ముందు జగన్మోహన్ రెడ్డిపై దృష్టి పడిందట. అందుకనే  ఢిల్లీ ఎన్నికల ఫలితాల సరళిని గమనించగానే మోడినే జగన్ ను పిలిపించుకోవాలని అనుకున్నారట. అందుకనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ ను ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించే అవకాశాలుందట. జగన్ ఎన్డీఏలోకి జాయిన్ అయితే రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటి ? ఏమిటంటే ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు ఖర్చు రీ ఎంబర్స్ మెంటు తదితరాల డిమాండ్లు చాలా కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయి.  హోదా అన్నది ముగిసిన అధ్యాయమని బిజెపి నేతలందరూ ఒకటే మాట చెబుతున్నారు.

 

కేంద్రప్రభుత్వమైతే   హోదా ఇవ్వనని నేరుగా  చెప్పకపోయినా అసలు మాట్లాడటమే లేదు. దాంతో విభజన చట్టంలో ప్రధానమైన హోదా అంశం దాదాపు మరుగనపడిపోయినట్లే. ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరితే  హోదా తో పాటు ఏపి ప్రయోజనాల విషయంలో మోడి స్పష్టమైన ప్రకటన చేస్తేనే రాష్ట్రానికి ఉపయోగం. అలా కాకుండా ఏదో ఓ నాలుగు కేంద్రమంత్రి పదవుల కోసం కక్కుర్తి పడితే చంద్రబాబునాయుడుకు ఎంత మైనస్ అయ్యిందో జగన్ కూ అంతే మైనస్ అవుతుందనే చెప్పాలి.

 

ఇక  మంత్రిపదవులంటారా ? ఓ క్యాబినెట్ మంత్రిపదవితో పాటు మూడు సహాయ మంత్రిపదవులు ఆఫర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  కేంద్రమంత్రివర్గంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందనే నమ్మకం ఏమీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా  నిర్ణయం తీసుకుంటేనే జగన్ కు మైలేజి పెరుగుతుంది లేకపోతే మైనస్సే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: