జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతం కర్నూలులో పర్యటించిన సంగతి అందరికీ తెలిసినదే. 2017 వ సంవత్సరం లో కర్నూలు లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య గురించి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్ అయ్యారు. ఇంత చిన్న పిల్ల ఆడ పిల్లకు జరిగిన అన్యాయానికి ఇంకా న్యాయం జరగక పోవడం దానికి కారణం ఇప్పటి వరకు మన వ్యవస్థ అలాగే కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన రాజకీయాలని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాగా ఇప్పటికైనా సుగాలి ప్రీతికి, తన కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రజలందరూ కూడా రోడ్లపైకి రావాలని, అలా చేస్తేనే ప్రీతికి న్యాయం జరుగుతుందని తెలిపారు.

 

అంతేకాకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దిశా అత్యాచారం హత్య ఘటనపై ప్రజలు ఏవిధంగా రోడ్లపైకి రావటం జరిగిందో ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్డు పైకి వచ్చి ప్రభుత్వం పై తిరగ బడాలని అప్పుడు కచ్చితంగా న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎలాగైనా సరే ప్రీతి హత్యకు కారణం అయినటువంటి నిందితులకు శిక్ష పడాల్సిందేనని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సుగాలి ప్రీతీ కి న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని, ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

 

అంతేకాకుండా త్వరలోనే మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుస్తామని మాట్లాడిన పవన్ కళ్యాణ్...ఒక బలహీన వర్గానికి చెందిన ఆడపిల్లకి న్యాయం చేయకపోతే...రాజధానులు నిర్మిస్తే ఏం లాభం...రాయలసీమ ఆడబిడ్డకు ఇంతటి అన్యాయం జరిగితే రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి అయిన జగన్ ఎందుకు రియాక్ట్ అవటం లేదని పవన్ ప్రశ్నించాడు. ఇంకా అనేక విషయాల గురించి వైయస్ జగన్ సర్కార్ పై ఫుల్ సీరియస్ అయ్యారు పవన్.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: