ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన వాటిని అడిగారు. అయితే.. జగన్ ఏం చెప్పాడు.. మోడీ ఏం అన్నాడు అన్నది వారిద్దరి మధ్య వ్యవహారం.. కానీ మీడియాకు ఉన్న తెలుస్తోంది.. సమాచారం.. అంటున్నారు.. వంటి పడికట్టు పదాలను వాడి జగన్ ను మోడీ చీవాట్లు పెట్టినట్టే చంద్రజ్యోతిగా చెప్పుకునే పత్రిక రాసేసింది.

 

సాధారణంగా.. జగన్, మోడీ మధ్య సంభాషణలు బయటకు రావు. అందులోనూ ఆంతరంగిక సంభాషణలు. చెబితే మోడీ చెప్పాలి.. లేకుంటే జగన్ చెప్పాలి.. లేదా జగన్ వెంట వెళ్లిన నేతలు చెప్పాలి. అంతే కదా. ఏ పత్రికకైనా ఇంతకు మించిన సోర్సు ఏముంటుంది.. పోనీ మోడీ కార్యాలయంలో ఏమైనా సీక్రెట్ కేమేరాలు పెట్టి రికార్డు చేస్తే తప్ప అంతకు మించి సమాచారం రాబట్టటం కష్టం.



కానీ ఈ పత్రిక మాత్రం.. లోపల ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పేసింది. మీ చర్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని మోదీ గన్‌ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాడట. రాష్ట్రంపై వారిలో అపనమ్మకం ఏర్పడిందని.. ఇటీవలి దావోస్‌ సదస్సులోనూ పలువురు ఆందోళన వ్యక్తంచేసిన విషయాన్ని ప్రస్తావించారట. అసలు దావోస్‌ లో ఎవరు ఆందోళన చేశారో.. అది ఆ రాసినవారికే తెలియాలి.



విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంటూ ఈ పత్రిక తాను రాయాలనుకున్నది రాసేసింది. పీపీఏల పునఃసమీక్ష, విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం, కియా మోటార్స్‌ యాజమాన్యానికి బెదిరింపులు, కియా తరలింపు వార్తలు.. ఇవన్నీ అడిగేసారట. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారని కడిగేశారట. దీని ప్రభావం దేశవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణంపై ఉంటుందని కోప్పడ్డారట. ఏంటో.. ఈ రాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: