ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..అయితే  ఈ కరోనా వైరస్ బారీన పడి చైనాలో వెయ్యికి పైగా చనిపోగా,ఇరవై వేల మందికి పైగా కరోనా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలు చోట్ల ఈ కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది . దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఈ వ్యాప్తి లక్షణాలు ఉన్నట్లు సమాచారం. 

 

ఇకపోతే..కరోనా వైరస్ నేపథ్యంలో సింగపూర్‌లో కండోమ్‌లకు కొరత ఏర్పడిదంట. అదేంటీ? కరోనా వైరస్‌కు, కండోమ్‌లకు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? లేదా అంత భయానక పరిస్థితుల్లోనూ వారికి సెక్స్ మీద ఆశ తగ్గడం లేదా అని సందేహిస్తున్నారా? అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకండి. ఆ కండోమ్‌లను వాడుతున్నది ఆ పని కోసం కాదు, కరోనా వైరస్ నుంచి ‘సేఫ్టీ’ కోసం.

 

సింగపూర్‌లో ముందు జాగ్రత్తగా ప్రజలు మెడికల్ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లో వాటికి భారీగా కొరత ఏర్పడింది. డిమాండుకు తగిన సంఖ్యలో మాస్కులు లేకపోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వాటికి ప్రత్యామ్నయంగా హ్యండ్ శానిటైజర్లు, టిష్యులు, కండోమ్‌లను కొనుగులు చేస్తున్నారు. కండోమ్‌లను సెక్స్ కోసం కొనుగోలు చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఇందుకు వేరే కారణం ఉంది.

 

మరో విషమేమంటే..ఏదైనా వస్తువును పట్టుకున్న కూడా ఈ కరోనా వైరస్ ప్రబలు తుంది అని చాలా మంది అంటున్నారు..అయితే సింగపూర్ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే చేతికి గ్లవ్స్ ధరించడం కూడా ఎంతో ముఖ్యం. ఆ వైరస్ చాలా శక్తివంతమైనది కావడంతో వస్తువులను ముట్టుకున్న సరే సోకే ప్రమాదం ఉంది. ఓ వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కేందుకు వేలుకు కండోమ్ తొడిగాడు...అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..ఆ ఐడియా బాగుండటంతో ఇప్పుడు అక్కడ కండమ్స్ కొరత ఏర్పడింది.. అదండీ మ్యాటర్...

మరింత సమాచారం తెలుసుకోండి: