తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పోటీ ఏర్పడింది. ఉచిత పథకాల నుండి మొదలుకుని పెన్షన్ ల వరకూ ప్రతీదీ రెండు రాష్ట్రాల్లోనూ అమలు అవుతోంది. అయితే అభివృద్ధిలో ఒక అడుగు ముందుంది మాత్రం తెలంగాణ ప్రభుత్వమే. దాదాపు తెలంగాణ ప్రభుత్వ విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాలో అవుతూ వస్తుంది. 

 

 


అయితే ఇప్పుడు తెలంగాణ పభుత్వం ఒక మంచి పథకంతో ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుండి ఉద్యోగం నిమిత్తం ఇతర దేశాలకి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఉద్యోగార్థులకి మంచి అవకాశం కల్పించనుంది. వరంగల్ కి చెందిన వంశీ రెడ్డి అనే ఐటీ పారిశ్రామిక వేత్తకి వరంగల్ లో ఐటీ సంస్థ ప్రారంభించామని తగిన సదుపాయాలని కల్పించనుంది. ఐటీ పరిశ్రమకి కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు ఆఫీసు కోసం ఎకరంన్నర భూమిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

 

 


ఈ విషయమే కేటిఆర్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలి. అయితే చాలామంది వలస వెళ్ళినవాళ్ళు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుండి సాయం రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వరంగల్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.

 

 

కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ డెవలప్ అవడానికి ఇదొక మంచి మార్గం. ఐటీ పరిశ్రమ వల్ల సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇతర దేశాలకి వలస వెళ్ళే వారు చాలా ఎక్కువ. ఏపో ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాలు అవలంబిస్తే అక్కడ కూడా ఉద్యోగాలకి ఏమాత్రం కొరత ఉండదు. ప్రతీ విషయంలోనూ తెలంగాణతో పోటీ పడే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: