తెలుగుదేశంపార్టీ పరిస్ధితి  నానాటికి దిగజారిపోతోందా ? తెలంగాణాలో పార్టీకి పట్టిన గతే తొందరలో ఏపిలో కూడా తప్పదా ? ఓ జాతీయ మీడియా ప్రసారం చేసిన ప్రత్యేక కథనం చూస్తే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడు వేస్తున్న వ్యూహాలేవీ ఫలించకపోవటాన్ని కూదా సదరు మీడియా ప్రస్తావించింది.  మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబు పరిస్ధితి మరీ దయనీయంగా తయారైపోయిందని మీడియా చెప్పటం గమనార్హం.

 

ఏపిలో చంద్రబాబు, తెలుగుదేశంపార్టీ పరిస్ధితిపై రిపబ్లిక్ టివి ప్రసారం చేసిన  ప్రత్యేక కథనం సంచలనంగా మారింది.  కష్టాల్లో ఉన్న టిడిపి చంద్రబాబు వ్యూహాలు వికటిస్తుందటంతో భవిష్యత్తులో మరింత గడ్డు పరిస్ధితులను ఎదుర్కునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  చంద్రబాబు నాయకత్వం మీద పార్టీ నేతల్లో కూడా రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందట.

 

అదే సమయంలో జగన్ పై ఏదశలో కూడా చంద్రబాబు ఒత్తిడి తేలేకపోతున్నారని చెప్పింది.  జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం చంద్రబాబును డిఫెన్స్ లో పడేస్తోందట. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, పిపిఏల సమీక్ష తో చంద్రబాబుకు షాక్ తగిలినట్లు పేర్కొంది. అలాగే స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టటం, మూడు రాజధానుల ఏర్పాటు లాంటి అంశాలపై జనాల్లో ఆమోదం రావటంతో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదట.

 

టిడిపి ప్రస్తుత పరిస్ధితికి కారణం ఏమిటంటే ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన మాయలేనని కూడా చెప్పింది. తన సామాజికవర్గంలోని ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా అమరావతి నిర్మాణంపై చంద్రబాబు మోసం చేశారని సదరు మీడియా అభిప్రాయపడింది. చంద్రబాబును గుడ్డిగా నమ్మి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు దిక్కుతోచక అవస్తలు పడుతున్నారట. కేవలం పెట్టిన పెట్టుబడుల కోసమే చివరకు చంద్రబాబు రెండు జిల్లాలకు మద్దతుగా మిగిలిన జిల్లాల్లోని పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేసినట్లు చానల్ తీర్మానించేసింది.

 

అన్నిటికన్నా మించి టిడిపిలో చంద్రబాబు తర్వాత నాయకత్వ సమస్య బాగా పట్టి పీడిస్తోందట.  చంద్రబాబు పక్కకు తప్పుకుంటే పార్టీని సమర్ధవంతంగా నడిపించే నాయకుడే లేడని చానల్ తీర్మానించేసింది. ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేసిన ఫలితమే ఇపుడు  పార్టీని ఇబ్బందులో పడేస్తోందని చానల్ అభిప్రాయపడింది. చంద్రబాబు చేసిన అనేక తప్పుల వల్లే ఏపిలో కూడా పార్టీకి తెలంగాణా గతే పట్టబోతోందని చెప్పేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: