రోడ్డు ప్రమాదంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. అప్పటి వరకు మనతో ఆనందంగా గడిపిన క్షణంలోనే అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. అతి వేగంతో ఒక్కరు, మద్యం మత్తులో మరొక్కరు ఇలా అందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 

 

ఆత్మీయులు దూరమై ఎందరో జీవితకాల భాదను అనుభవిస్తున్నారు. మరి కొందరు రోడ్డు ప్రమాదాలలో వారి అవయవాలను పోగొట్టుకొని వికలాంగులుగా మరి, నరక ప్రాయంగా బ్రతుకును సాగిస్తున్నారు.వాహనదారుల నిర్లక్ష్యంతో ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ ఇది..! అందరూ చూస్తుండగానే జరిగిన ఘోర ప్రమాదమిది..!

 

తమిళనాడులోని కోయంబత్తూరులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పిన బస్సు.. పక్కనే ఎడమ వైపున వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. మొత్తం లెఫ్ట్‌కి తిరిగి టూవీలర్‌ని ఎక్కేసింది. ప్రమాదంలో స్కూటీ పూర్తిగా ధ్వంసమవగా.. వానిపై ఉన్న వ్యక్తి వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నుంచి ప్రయాణికులు కిందకు దిగి అతడిని కాపాడారు. గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఐతే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

 

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూనే ఉంది. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కల్పిస్తూనే ఉన్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెంట్, సిట్ బెల్ట్ ధరించాలి. వాహనదారులు నిర్ణిత వేగంతో ప్రయాణిస్తే కొత్త వరకు ప్రమాదాలను అరికట్ట వచ్చును. వాహన చోదకులకు ట్రాఫిక్ నియమాలతో పాటు వారి కుటుంబ భద్రపై కూడా అవగాహన కల్పించాలి. వారు చేసే నిర్లక్ష్యంతో జీవితాంతం వారి కుటుంబం బాధలు పడాల్సి వస్తాదని తెలియజేయాలి. వాహనదారులు ట్రాఫిక్ నిమయాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తే కొంత వరకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: