ఆంధ్రప్రదేశ్ లో టిడీపీ పరిస్థితి రోజు రోజుకీ మరింత దిగజారుతోంది. వైఎస్సాఆర్ సీపీ గెలిచిన దగ్గర నుండి ప్రతీ క్షణం వారికి భయం భయంగా ఉంటోంది. అందువల్లే చాలా మంది టీడీపీ నాయకులు వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే టిడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా తయారైంది. అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రజల్లో నమ్మకం లేకపోవడం శాపంగా మారింది. అసలే సిట్యుయేషన్ బాగాలేని పరిస్థితుల్లో మరికొన్ని అవాంతరాలు పార్టీ ప్రతిష్టని  మరింత దిగజార్చేలా ఉన్నాయి.

 

 


ఏ పార్టీకైనా కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. కార్యకర్తల వల్లే ఆ పార్టీ నిలబడుతుంది. వారి వల్లే పార్టీ పడిపోతుంది. తాజాగా ఒక సంఘటన టిడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కడప జిల్లాకి చెందిన రెడ్డప్ప అనే టీడీపీ కార్యకర్త చేసిన నిర్వాకం బట్టబయలు కావడంతో అందరూ షాక్ తిన్నారు. అసలు విషయంలోకి వెళ్తే జగన్ సొంత జిల్లా అయిన కడపకి చెందిన రెడ్డప్ప అధికారులతో పని చేయించుకోవడం కోసం ఏపీ మంత్రి తానేటి వనిత సంతకాన్నే ఫోర్జరీ చేశాడు.

 

 


సంతకం ఒక్కటే కాదు.. లెటర్ హెడ్ ని కూడా ఫీర్జరీ చేసి దొరికిపోయాడు. ఈ లెటర్ హెడ్ తో లో ఉన్న సంతకాన్ని అతడు కడప జిల్లా కలెక్టర్ కి పంపాడు. కడప జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని వనిత గారికి చేరవేయడంతో అది తానివ్వలేదని తేలింది. వెంటనే ఈ విషయం మీద యాక్షన్ తీసుకోవాలని ఏపీ హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ లకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని స్వీకరించిన డీజీపీ దర్యాప్తు చేపడుతున్నారు.

 

 


ఒక సామాన్య కార్యకర్త ఏపీ మంత్రి సంతకాన్ని లెటర్ హెద్ ని ఫోర్జరీ చేయడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ వార్త టీడీపీ వర్గాల్లో కొంత ఆందోళనని రేకెత్తించేదే. దీన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు టీడీపీ పై రెచ్చిపోవడం ఖాయం. మరి వాటిని టీడీపీ నాయకులు ఎలా తట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: