ము.. ము.. ముద్దంటే చేదా మీకా ఉద్దేశం లేదా అనే ఓల్డ్ సాంగ్ ని చాలాసార్లు విన్నాం. ఈ సాంగ్ లో అక్కినేని నాగేశ్వరావు మనసు లేనిది ముద్దు పెట్టలేనని చెబుతాడు. ఇది నిజమే కానీ ముద్దంటే కేవలం ఒక ప్రేమించుకుంటున్న ఆడ, మగ మధ్య జరిగేది కాదు. ముద్దు అనేది ఎవరికి ఎవరైనా ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకి ఓ తల్లీ తన బిడ్డని నుదిటిపై ముద్దుపెట్టుకోవచ్చు. ఓ అన్న తన చెల్లిని, ఓ తండ్రి తన బిడ్డని, ఓ ఫ్రెండ్ తన క్లోజ్ ఫ్రెండ్ ని ఇలా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆప్యాయతను ముద్దు రూపంలో చూపించవచ్చు.

 

మనుషుల మధ్య బంధాలు బలంగా పెరగాలంటే, ఒకరికి ఒకరు బాగా దగ్గరవ్వాలంటే ముద్దు పెట్టుకోవడం అనేది తప్పనిసరి అని అనాది కాలం నుండి వస్తున్న ఓ ఆచారమే. కానీ ఈ రోజుల్లో ముద్దుని ఒక బూతు లాగా, ఒక కామ కార్యం లాగా చూస్తున్నారు. అది చాలా బాధాకరం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఈరోజు వరల్డ్ కిస్సింగ్ డే. అందుకే ముద్దు యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ ఒక సారి గుర్తు చేయాలని మా ఈ చిన్న ప్రయత్నం.



ముద్దు పెట్టుకోవడం వలన మానవ బంధాలు పెరుగుతాయని సైంటిఫిక్ పరంగా రుజువైంది. ఎన్నో స్టడీస్ చేపట్టిన తర్వాత శాస్త్రవేత్తలు ముద్దు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేంటో ఓ లుక్కు వేసుకుందాం.


ముద్దు పెట్టుకున్నప్పుడు మన మెదడు ఆక్సిటోసిన్, "లవ్ హార్మోన్", వాసోప్రెసిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుంది.ఇది మన మనోభావాలను సమతుల్యంగా ఉంచడానికి ఎండోజెనస్ ఓపియాయిడ్లు, డోపామైన్ ఇంకా ఇతర ఫీల్ గుడ్ న్యూరోహార్మోన్‌లను విడుదల చేస్తుంది. దీనివలన మనకి మానసిక సంతోషం కలుగుతుంది. ఇంకా ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ కి మనల్ని శారీరకంగా, మానసికంగా బాగుచేసేంత సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన జీవితంలోని సమస్యలతో మానసికంగా క్రుంగి పోతుంటే.. తనకి దగ్గరైన వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పి తనని ముద్దు పెట్టుకుంటే ఆ వ్యక్తి తప్పకుండా మానసికంగా బలపడతాడు.

 

ముద్దుకి ఒత్తిడిని సులువుగా తగ్గించే శక్తి ఉంది. అలాగే ముద్దు ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని కూడా ముద్దు తగ్గించేస్తుంది. మంచిగా బ్రష్ చేసి అదర చుంబనం చేయడం ద్వారా లాలాజలం లోని మంచి బ్యాక్టీరియా ఒకరి నుండి ఒకరికి సరఫరా అయ్యి రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. క్యావిటీస్ లాంటి దంత సంబంధిత వ్యాధులను కూడా రానివ్వకుండా ముద్దు చేస్తుంది. వినాశన స్థితిలో ఉన్న వివాహ బంధాలను కూడా దృఢపరచగల శక్తి ముద్దుకి ఉందని శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్పారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మీరు మీ వారికి ముద్దు పెట్టకుండా ఉండగలరా.!?








మరింత సమాచారం తెలుసుకోండి: